NC24 | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండుతో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. NC24 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం మైథలాజికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్తను షేర్ చేశారు మేకర్స్.
ఎన్సీ 24 బీటీఎస్ మేకింగ్ వీడియోను విడుదల చేస్తూ.. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నవంబర్ 23న లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు. నాగచైనత్య కెరీర్లో ఇదివరకెన్నడూ చేయని స్టంట్స్ చేయబోతున్నాడని బీటీఎస్ వీడియో చెప్పేస్తుంది. ఈ సినిమా కోసం కథలో చాలా కీలకమైన రంగురంగుల కోటను భారీ బడ్జెట్‌తో ప్రత్యేకంగా నిర్మించినట్టు అర్థమవుతోంది. ఈ కోట సినిమాకే హైలెట్‌గా నిలువబోతున్నట్టు విజువల్స్ చెబుతున్నాయి.
ప్రతీ యాత్ర ఒక రహస్యంతో ప్రారంభమవుతుందంటూ ఇప్పటికే డార్క్ షేడ్స్‌లో ఉన్న మీనాక్షి చౌదరి లుక్ షేర్ చేశారు. ఈ చిత్రంలో లాపతా లేడీస్ ఫేం స్పర్శ్ శ్రీవాత్సవ NC24 కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎస్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ సమకూరుస్తుండటంతో హైప్ మరింత పెరిగిపోతుంది.
A dream this big needs a world equally grand.
Today, we reveal the heart and hard work of a special set in #NC24 through a tiny BTS Video.Let’s celebrate BIG with the TITLE and FIRST LOOK POSTER ON NOVEMBER 23rd ❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/5OsAIFVi6N
— NC24 (@Nc24chronicles) November 20, 2025
Keerthy Suresh | చాలా బాధగా ఉంది.. AI డీప్‌ఫేక్ చిత్రాలపై కీర్తి సురేష్ ఎమోషనల్
Kapoor Family | కపూర్ ఫ్యామిలీ డిన్నర్లో కనిపించని ఆలియా భట్.. కారణం చెప్పిన అర్మాన్ జైన్!