Handshake Row | భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ వార్తల్లో నిలిచాడు. అబుదాబి టీ10 లీగ్‌లో పాక్ ఫాస్ట్ బౌలర్ షానవాజ్ దహానీతో కరచాలనం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గురువారం జాయెద్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ తర్వాత ఆస్పిన్ స్టాలియన్స్ కెప్టెన్ హర్భజన్ దహానీతో కరచాలనం చేశాడు. భారత్-పాక్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం క్రికెట్ మైదానంలోనూ కనిపించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండుదేశాల ఆటగాళ్ల మధ్య దూరం పెరిగింది. భారత జట్టు మెన్స్, వుమెన్స్ క్రికెటర్లు పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు.
ఆసియా కప్‌లో భారత జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టు పాకిస్తాన్‌కు చెందిన సల్మాన్ అఘాతో కరచాలనం చేయడానికి నిరాకరించాడు. ఐసీసీ వుమెన్స్ ప్రపంచ కప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్.. పాక్ కెప్టెన్ ఫాతిమా సనాతో కరచాలనం చేయలేదు. దోహాలో జరుగుతున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లోనూ భారత్, పాక్ ఆటగాళ్లు కరచాలనం చేయలేదు. రాజకీయ ఉద్రిక్తతలు మైదానాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. అలాంటి వాతావరణంలో హర్భజన్ చర్య వివాదాస్పదమైంది. 2025 ప్రారంభంలో హర్భజన్, శిఖర్ ధావన్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, సురేష్ రైనాలు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాకిస్తాన్‌తో ఆడేందుకు నిరాకరించారు. ఉద్రిక్త పరిస్థితుల్లో రక్తం, చెమట కలిసి ప్రవహించలేవంటూ ఈ సమయంలో ప్లేయర్లు స్పష్టం చేశారు.
ఈ మ్యాచ్‌ను బహిష్కరించడంతో భారత్ సెమీ ఫైనల్ ఆడకపోవడంతో పాకిస్తాన్ వాక్ ఓవర్ ద్వారా ఫైనల్‌కు చేరుకుంది. తాజాగా హర్భజన్ సింగ్ పాక్ ప్లేయర్‌తో కరచాలనం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఓ యూజర్ స్పందిస్తూ.. షానవాజ్ దహానీతో హర్భజన్ సింగ్ కరచాలనం చేశాడని.. ‘భారతీయుల దేశభక్తి ఇప్పుడు ఎక్కడికి పోయింది’ అంటూ ప్రశ్నించాడు. మరో యూజర్ స్పందిస్తూ ‘మ్యాచ్ తర్వాత షనవాజ్తో హర్భజన్ సింగ్ కరచాలనం చేశాడని.. దహానీ చిరునవ్వుతో స్పందించాడని.. అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ దీన్ని ఎందుకు చూడలేం అంటూ ఆశ్చర్యం కలిగిస్తుందంటూ వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉండగా.. నవంబర్ 16న శ్రీలంకలో జరిగిన బ్లైండ్ వుమెన్స్ టీ20 మ్యాచ్‌లోనూ భారత్-పాక్ జట్లు కరచాలనం చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌లో గెలిచింది. ఇక రెండు జట్లు ఒకే బస్‌లో ప్రయాణించాయి. రెండు జట్లు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాయి. ఒక జట్టును మరో జట్టు అభినందించారు. ఇక అబుదాబి టీ10 మ్యాచ్‌లో నార్తర్న్ వారియర్స్ జట్టు ఆస్పిన్ స్టాలియన్స్‌ను నాలుగు పరుగుల తేడాతో ఓడించింది. నార్తర్న్ వారియర్స్ 10 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 114 పరుగులు చేసింది. ఆస్పిన్ జట్టు ఏడు వికెట్లకు 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్తాన్‌కు చెందిన షానవాజ్ దహానీ అద్భుతంగా రాణించి 10 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. హర్భజన్ ఒక ఓవర్ బౌలింగ్ వేసిన హర్భజన్ 8 పరుగులు ఇవ్వగా.. బ్యాటింగ్‌లో ఒక పరుగు చేసి రనౌట్ అయ్యాడు.
Harbhajan Singh handshake with Shahnawaz Dahani. Ab kahan gai patriotism indians ki. #AbuDhabiT10 @iihtishamm pic.twitter.com/4ZFfgP2ld3
— Ather (@Atherr_official) November 19, 2025