వెల్లింగ్టన్: న్యూజిలాండ్ వర్ధమాన క్రికెటర్ చాడ్ బోవ్స్ లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ద్విశతకాన్ని నమోదుచేశాడు. 103 బంతుల్లోనే అతడు డబుల్ సెంచరీ సాధించి లిస్ట్-ఏ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించడమే గాక ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), నారాయణ్ జగదీశన్(భారత్) పేరిట ఉన్న రికార్డులను తిరగరాశాడు. హెడ్, జగదీశన్ 114 బంతుల్లోనే ఈ ఘనత సాధించారు. చాడ్ విషయానికొస్తే.. కివీస్ దేశవాళీలో జరుగుతున్న ఫోర్డ్ కప్లో క్యాంటర్బరీ తరఫున ఆడిన అతడు ఒటాగోతో మ్యాచ్లో ఈ రికార్డును అందుకున్నాడు. 53 బంతుల్లోనే శతకాన్ని పూర్తిచేసిన అతడు.. 110 బంతులాడి 27 బౌండరీలు,7 భారీ సిక్సర్ల సాయంతో 205 పరుగులు చేశాడు.