Rohit Sharma | టీమిండియా వన్డే, టెస్టు సారథి రోహిత్ శర్మ మరోసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు గురయ్యాడు. శ్రీలంక పర్యటన నిమిత్తం వన్డేలు ఆడేందుకు ఇదివరకే అక్కడికి చేరుకున్న హిట్‌మ్యాన్.. ట్రైనింగ్ సెషన్ సందర్భంగా తన ఫోటోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి దొరికిపోయాడు. ఎడిటెడ్ ఫోటోలో రోహిత్.. తన పొట్ట (బెల్లీ)ని వెనక్కినెట్టినట్టు సృష్టించాడు. కానీ బీసీసీఐ కూడా ట్రైనింగ్ సెషన్ ఫోటోలను విడుదల చేయడంలో రోహిత్ ‘ఎడిటింగ్ స్కిల్స్’ బయటపడ్డాయి. నెటిజన్ల ట్రోలింగ్ దెబ్బకు హిట్‌మ్యాన్.. సోషల్ మీడియా నుంచి ఆ ఫోటోను డిలీట్ చేయక తప్పలేదు.
రోహిత్ పోస్ట్ చేసిన ఫోటోపై నెటిజన్లు స్పందిస్తూ… ‘ఇంతమాత్రానికి జిమ్‌లకు వెళ్లి బరువులు మోయడం ఎందుకు..? గంటలకు గంటల పాటు అక్కడ చెమటలు కక్కడం ఎందుకు..? ఫోటోలను ఎడిట్ చేసుకుంటే పోలా’ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఆకతాయిలు ఈ ఫోటోపై.. ‘రోహిత్ భయ్యా ఫ్యాన్స్‌తో పాటు అతడూ పిక్స్ఆర్ట్ యాప్ బాగా వాడతారనుకుంటా’ అని ఆటాడుకుంటున్నారు. టీ20 వరల్డ్ కప్ నెగ్గినప్పటి రోహిత్ ఫోటోలు, తాజా ఫోటోలను మ్యాచ్ చేస్తూ మీమ్స్‌తో నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. రోహిత్ తన పొట్టను ఎంత కవర్ చేయాలని చూసినా బీసీసీఐ మాత్రం నిజం చెప్పిందని చురకలంటిస్తున్నారు.
Why go to gym when you can do photoshop 😈
– Rohit Sharma pic.twitter.com/cTiefmRrpG— Abhinav (@TotalKohli) July 30, 2024
Warning @StarSportsIndia . Stop editing rohit sharma’s tommy during live telecast or avoid showing his body below chest.
We know every single detail about the owner.
This is the last warning. Next will be a face reveal. 👍 pic.twitter.com/2PyEyD1s7B
— Kohlinat!on__👑🚩 (@BholisSoul) July 31, 2024
నెటిజన్ల ట్రోలింగ్‌తో రోహిత్ శర్మ ఈ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించాడు. ఇదిలాఉండగా లంకతో ఆగస్టు 2 నుంచి భారత జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. 2, 4, 7 తేదీలలో మూడు వన్డేలు జరుగుతాయి. టీ20 ప్రపంచకప్ నెగ్గిన తర్వాత రోహిత్, కోహ్లీలు ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. ఇక కొత్త కోచ్ గంభీర్‌తో రోహిత్, కోహ్లీ ఎలా సమన్వయం చేసుకుంటారు? టీమ్ఇండియా మాజీ సహచరులైన ఈ దిగ్గజాలు.. ఇప్పడు కోచ్ అండ్ ప్లేయర్స్‌గా ఎలా రాణిస్తారనేది ఆసక్తికరం.
Rohit Sharma loves Picsart so much 😭 https://t.co/OhB2qYcyBf pic.twitter.com/EyLsZDHDSu
— ` (@kohlizype) July 31, 2024