Ravi Shastri | ఇంకా ఆలస్యం చేయొద్దు.. టెస్టు జట్టులో కొత్త ముఖాలకు చోటివ్వాలి : రవి శాస్త్రి
Ravi Shastri : వరుసగా రెండోసారి టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final) భారత జట్టు ఓటమి ఎన్నో ప్రశ్నలను రేకెత్తింది. జట్టు కూర్పుపై, ఆటగాళ్ల ప్రదర్శనపై మాజీ క్రికెటర్లతో సహా సగటు అభిమానులు కూడా పెదవి విరిచారు. టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి(Ravi Shastri) కూడా టెస్టు జట్టును మార్చాల్సిన అవసరం....
Ravi Shastri : వరుసగా రెండోసారి టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final) భారత జట్టు ఓటమి ఎన్నో ప్రశ్నలను రేకెత్తింది. జట్టు కూర్పుపై, ఆటగాళ్ల ప్రదర్శనపై మాజీ క్రికెటర్లతో సహా సగటు అభిమానులు కూడా పెదవి విరిచారు. దాంతో, టెస్టు జట్టును మార్చాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని చాలామంది వెల్లడిస్తున్నారు. తాజాగా టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి(Ravi Shastri) కూడా అదే మాట అన్నాడు. ఆస్ట్రేలియా మాదిరిగా భారత టెస్టు జట్టులో కొత్త ముఖాలకు చోటివ్వాలని తెలిపాడు.
అందుకని సీనియర్ ఆటగాళ్లు రిటైర్ అయ్యేదాకా వేచి చూడాల్సిన అవసరం లేదని అతను అన్నాడు. ‘టెస్టు జట్టు ఎంపికలో ఆస్ట్రేలియా(Australia) మనకంటే చాలా బెటర్. ఒక్కసారిగా ఐదారుగురు సీనియర్ ఆటగాళ్లు వీడ్కోలు పలికేంత వరకు వాళ్లు వేచి చూడరు. ప్రతిభావంతులైన కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు మనం చేయాల్సింది కూడా అదే. ఇంకా ఆలస్యం చేయొద్దు’ అని రవి శాస్త్రి వెల్లడించాడు. అంతేకాదు జట్టు దీర్ఘ కాలిక ప్రయోజనాల దృష్టా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని అతను అన్నాడు. అనిల్ కుంబ్లే(Anil Kunble) తర్వాత రవి శాస్త్రి 2017లొ భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతడి హయాంలోనే టీమిండియా నంబర్ 1 టెస్టు జట్టు అయింది. అయితే.. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో, 2021-22 డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిపోయింది.
2021లో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన టీమిండియా

269 పరుగులకే ఆలౌట్
ఓవల్ స్టేడియంలో జరిగిన టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) భారత్ అనూహ్యంగా ఓటమి పాలైంది. 209 పరుగులతో ఆసీస్ అద్భుత విజయం సాధించి టెస్టు గదను తన్నుకుపోయింది. ట్రావిస్ హెడ్(163), స్టీవ్ స్మిత్(121) సెంచరీలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 469 రన్స్ కొట్టింది. ఆ తర్వాత బోలాండ్, కమిన్స్ విజృంభించడంతో భారత్ 269 పరుగులకే ఆలౌటయ్యింది. రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్ 270 వద్ద డిక్లేర్ చేసింది. 444 పరుగుల ఛేదనలో టీమిండియా ఏ దశలోనూ విజయానికి చేరువగా రాలేదు. విరాట్ కోహ్లీ(49), అజింక్యా రహానే(46), శ్రీకర్ భరత్(23) పోరాడినా లాభం లేకపోయింది. లియాన్ ఓవర్లో సిరాజ్ ఔట్ కావడంతో 234కు ఆలౌటయ్యింది. దాంతో, రెండోసారైనా చాంపియన్‌గా నిలవాలనుకున్న టీమిండియా కల చెదిరింది.
ఇవి కూడా చదవండి
Sunil Gavaskar | వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసినా లాభం లేదు.. ఎందుకంటే..? గావస్కర్
Tushar Deshpande | చిన్ననాటి స్నేహితురాలితో సీఎస్కే పేసర్ నిశ్చితార్థం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Australia
- India
- oval
- Ravi Shastri
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

