Sunil Gavaskar | వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసినా లాభం లేదు.. ఎందుకంటే..? గావస్కర్
Sunil Gavaskar : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టు ప్రదర్శనపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్(Sunil Gavaskar) తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టకు గావస్కర్ హచ్చరిక చేశాడు. విండీస్‌ను వైట్‌వాష్ చేసినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదని తెలిపాడు. భారత జట్టు ఇలానే తమ తప్పులను పునరావృతం చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి....
Sunil Gavaskar : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టు ప్రదర్శనపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్(Sunil Gavaskar) తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. ఫైనల్లో జట్టు కూర్పు, స్టార్ ఆటగాళ్ల షాట్ల ఎంపికను కూడా అతను తప్పు పట్టాడు. వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టకు గావస్కర్ హచ్చరిక చేశాడు. విండీస్‌కు వెళ్లి.. ఆ జట్టును 2-0, 3-0తో ఓడించాలని చెప్పాడు. అయితే.. విండీస్‌ను వైట్‌వాష్ చేసినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదని అతను తెలిపాడు.
‘వెస్టిండీస్‌తో మాకు రెండు మ్యాచ్‌లు ఉన్నాయని సంబురపడకండి. ఎందుకంటే..? ప్రపంచంలోని ఉత్తమ జట్లలో విండీస్ ఒకటి కాదు. విండీస్‌కు వెళ్లి.. ఆ జట్టును 2-0, 3-0తో ఓడించండి. అయినా కూడా దాని వల్ల ఏం ఉపయోగం ఉండదు. భారత జట్టు ఇలానే తమ తప్పులను పునరావృతం చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా(Australia) వంటి పెద్ద జట్లతో ఐసీసీ ఫైనల్ ఆడేటప్పుడు పొరపాట్లు చేస్తే ట్రోఫీ ఎలా గెలుస్తారు?’ అని గావస్కర్ భారత ఆటగాళ్లను ప్రశ్నించాడు.
మొదటి టెస్టు జూలై 12న
వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)లో టీమిండియా రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. మొదటి టెస్టు జూలై 12 – 16 తేదీల్లో విండ్సర్ పార్క్ స్టేడియంలో, రెండో టెస్టు 20-24 మధ్య క్వీన్స్ పార్ట్ ఓవల్ వేదికగా జరగనున్నాయి. వన్డే సిరీస్ జూలై 27న మొదలు కానుంది. మొదటి వన్డేకు కింగ్స్టన్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. రెండో వన్డే జూలై 29న అదే స్టేడియంలో జరగనుంది. భారత్, వెస్టిండీస్ జట్లు ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో మూడో వన్డే ఆడతాయి. ఐదు టీ 20ల సిరీస్ ఆగష్టు 3న ప్రారంభమవుతుంది. ఆగష్టు 6, 8, 12, 13న మిగతా టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి.
🚨 NEWS 🚨
2️⃣ Tests
3️⃣ ODIs
5️⃣ T20Is
Here’s the schedule of India’s Tour of West Indies 🔽#TeamIndia | #WIvIND pic.twitter.com/U7qwSBzg84
— BCCI (@BCCI) June 12, 2023
రహానే, కోహ్లీ పోరాడినా…
టెస్టు క్రికెట్‌కు కొత్త జీవం తెచ్చిన టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) భారత్, ఆస్ట్రేలియా తలపడ్డాయి.టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ట్రావిస్ హెడ్(163), స్టీవ్ స్మిత్(121) సెంచరీలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 469 రన్స్ కొట్టింది. ఆ తర్వాత బోలాండ్, కమిన్స్ విజృంభించడంతో భారత్ 269 పరుగులకే ఆలౌటయ్యింది.
విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే

రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్ 270 వద్ద డిక్లేర్ చేసింది. 444 పరుగుల ఛేదనలో టీమిండియా ఏ దశలోనూ విజయానికి చేరువగా రాలేదు. విరాట్ కోహ్లీ(49), అజింక్యా రహానే(46), శ్రీకర్ భరత్(23) పోరాడినా లాభం లేకపోయింది. లియాన్ ఓవర్లో సిరాజ్ ఔట్ కావడంతో 234కు ఆలౌటయ్యింది. దాంతో 209 పరుగులతో ఆసీస్ అద్భుత విజయం సాధించింది. దాంతో, రెండోసారైనా చాంపియన్‌గా నిలవాలనుకున్న టీమిండియా కల చెదిరింది.
ఇవి కూడా చదవండి
Tushar Deshpande | చిన్ననాటి స్నేహితురాలితో సీఎస్కే పేసర్ నిశ్చితార్థం
Ben Stokes | ప్రత్యర్థి ఎవరైనా సరే బాజ్‌బాల్ ఆటను మార్చుకోం.. యాషెస్‌కు ముందు బాంబ్ పేల్చిన స్టోక్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

