Tushar Deshpande | చిన్ననాటి స్నేహితురాలితో సీఎస్కే పేసర్ నిశ్చితార్థం
Tushar Deshpande : ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో అదరగొట్టిన తుషార్ దేశ్‌పాండే(Tushar Deshpande) త్వరలోనే ఒక ఇంటివాడు కానున్నాడు. ఈ చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ ఫాస్ట్ బౌలర్ తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్ళి చేసకోబోతున్నాడు. ఈరోజు అతడి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. దేశ్‌పాండే, నభ గడ్డంవర్(Nabha Gaddamwar).. ఇద్దరూ చిన్నప్పుడు ఒకే బడిలో చదువుకున్నారు. అప్పటి నుంచి...
Tushar Deshpande : ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో అదరగొట్టిన తుషార్ దేశ్‌పాండే(Tushar Deshpande) త్వరలోనే ఒక ఇంటివాడు కానున్నాడు. ఈ చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ ఫాస్ట్ బౌలర్ తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్ళి చేసకోబోతున్నాడు. ఈరోజు అతడి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. దేశ్‌పాండే, నభ గడ్డంవర్(Nabha Gaddamwar).. ఇద్దరూ చిన్నప్పుడు ఒకే బడిలో చదువుకున్నారు.
అప్పటి నుంచి మొదలైన స్నేహం కాస్త ఆ తర్వాత ప్రేమగా మారింది. వీళ్ల ప్రేమకు ఇరుకుటుంబాలు అంగీకారం తెలపడంతో ఎంగేజ్మెంట్ నిర్వహించారు. ‘ఆమె(నభ)కు నా స్కుల్ క్రష్ నుంచి భార్యగా ప్రమోషన్ వచ్చింది’ అని ఆసక్తికర క్యాప్షన్ రాశాడు. తుషార్ దేశ్‌పాండే, నభ ఎంగేజ్మెంట్కు సీఎస్కే ఆటగాడు శివం దూబే(Shivam Dube) హాజరయ్యాడు.
సహచరుల కంగ్రాట్స్
తమ నిశ్చితార్థ వేడుక ఫొటోలను తుషార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.ప్రస్తుతం వీళ్ల ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఈమధ్యే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ‘ఇద్దరికీ కంగ్రాట్స్. కాబోయే దంపతులకు మ్యారేజ్ క్లబ్‌లోకి స్వాగతం’ అని కామెంట్ చేశాడు. ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, చెన్నై బౌలర్లు దీపక్ చాహర్, సిమర్జీత్ సింగ్ తుషార్ దేశ్‌పాండే, నభకు ఇన్‌స్టాలో శుభాకాంక్షలు తెలిపారు.

కప్ అందించిన జడేజా
ఐపీఎల్ 16వ సీజన్లో తుషార్ దేశ్‌పాండే అద్భుతంగా రాణించాడు. 16 మ్యాచుల్లో అతను 21 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో సీఎస్కే తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అతనే కావడం విశేషం. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో దేశ్‌పాండే.. లక్ష్య ఛేదనలో రవీంద్ర జడేజా(11 నాటౌట్) సంచలన ఆటతో చెన్నైని గెలిపించాడు. మోహిత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో చివరి రెండు బంతులకు సిక్స్, ఫోర్ బాదాడు. దాంతో, ధోనీ సేన ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.
ఇవి కూడా చదవండి
Ben Stokes | ప్రత్యర్థి ఎవరైనా సరే బాజ్‌బాల్ ఆటను మార్చుకోం.. యాషెస్‌కు ముందు బాంబ్ పేల్చిన స్టోక్స్
Lanka Premier League | శ్రీలంక గడ్డపై తొలి ప్రీమియర్ లీగ్.. వేలంలో భారత మాజీ క్రికెటర్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

