Ben Stokes | ప్రత్యర్థి ఎవరైనా సరే బాజ్‌బాల్ ఆటను మార్చుకోం.. యాషెస్‌కు ముందు బాంబ్ పేల్చిన స్టోక్స్
Ben Stokes : యాషెస్ సిరీస్(Ashsh Series 2023)కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) బాంబ్ పేల్చాడు. ప్రత్యర్థి ఆస్ట్రేలియా అయినా.. మరే జట్టు అయినా సరే తాము బాజ్‌బాల్(Bazball) తరహా గేమ్ ఆడతామని అన్నాడు. తమను ఓడించడం అంత సులువు కాదని చెప్పకనే చెప్పిన అతను పరోక్షంగా ఆస్ట్రేలియాను హెచ్చరించాడు. 'యాషెస్ సిరీస్‌లో మాకు ఆస్ట్రేలియా(Australia) నుంచి....
Ben Stokes : యాషెస్ సిరీస్(Ashsh Series 2023)కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) బాంబ్ పేల్చాడు. ప్రత్యర్థి ఆస్ట్రేలియా అయినా.. మరే జట్టు అయినా సరే తాము బాజ్‌బాల్(Bazball) తరహా గేమ్ ఆడతామని అన్నాడు. తమను ఓడించడం అంత సులువు కాదని చెప్పకనే చెప్పిన అతను పరోక్షంగా ఆస్ట్రేలియాను హెచ్చరించాడు. ‘యాషెస్ సిరీస్‌లో మాకు ఆస్ట్రేలియా(Australia) నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని తెలుసు. అయితే.. విజయం సాధించేందుకు మా దగ్గర సూపర్ టెక్నిక్ ఉంది. అదే ‘బాజ్‌బాల్’. మా దూకుడైన ఆట ప్రత్యర్థిని బట్టి మారదు ‘అని స్టోక్స్ తెలిపాడు.
అంతేకాదు యాషెస్ కోసమని తమ అటాకింగ్ గేమ్‌ను మార్చుకుంటే.. గత సంవత్సర కాలంగా తాము పడుతున్న కష్టానికి అర్థమే ఉండదని స్టోక్స్ అన్నాడు. 5 టెస్టుల యాషెస్ సిరీస్ జూన్ 16న మొదలుకానుంది. రెండు రోజుల క్రితమే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) గెలిచిన ఆస్ట్రేలియా జోరు మీద ఉంది. భారత జట్టును 209 పరుగుల తేడాతో ఓడించిన ఆసీస్ తొలిసారి టెస్టు గదను సొంతం చేసుకుంది.
హెడ్‌కోచ్ మెక్కల్లమ్తో స్టోక్స్

మెక్కల్లమ్ నిక్ నేమ్‌తో..
బ్రెండన్ మెక్కల్లమ్(Brendon McCullum)హెడ్‌కోచ్‌గా వచ్చాక ఇంగ్లండ్ జట్టు ఆట మారిపోయింది. పవర్ హిట్టర్ అయిన ఈ న్యూజిలాండ్ మాజీ ఆటగాడి నిక్ నేమ్.. బాజ్(Baz). దాంతో, అతడు ఇంగ్లండ్ ఆటగాళ్లకు చెప్పిన ధనాధన్ బ్యాటింగ్ టెక్నిక్.. ‘బాజ్‌బాల్'(Bazball) టెక్నిక్‌గా పేరొందింది. ఇంగ్లండ్ జట్టు అదే తరహా ఆటతో సొంత గడ్డపై చెలరేగి ఆడింది. పాకిస్థాన్ టూర్లోనూ టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే బాజ్ బాల్ ఆటతో టెస్టు చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేయాలని స్టోక్స్ బృందం భావిస్తోంది. గత ఏడాది ఆసీస్ పర్యటనలో ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ కోల్పోయింది. దాంతో, ఈసారి సొంత గడ్డపై కమిన్స్ సేనను చిత్తు చేయాలని ఇంగ్లండ్ జట్టు కసితో ఉంది.
టెస్టు గదతో ఆస్ట్రేలియా జట్టు

ఒకే ఒక మ్యాచ్
ఐపీఎల్ 16వ సీజన్లో బెన్ స్టోక్స్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. వేలంలో అతడిని రూ. 17.25 కోట్లకు కొన్నది. కానీ, స్టోక్స్ ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. గాయం కారణంగా బెంచీకే పరిమితమయ్యాడు. జట్టు కాంబినేషన్ కుదరడంతో సీఎస్కే అతడిని ఆడించలేదు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో జడేజా సంచలన ఆటతో చెన్నైని గెలిపించాడు. దాంతో, ధోనీ సేన ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది.
ఇవి కూడా చదవండి
Lanka Premier League | శ్రీలంక గడ్డపై తొలి ప్రీమియర్ లీగ్.. వేలంలో భారత మాజీ క్రికెటర్
Novak Djokovic | 20 ఏళ్ల టెన్నిస్ కెరీర్.. వెయ్యి కోట్లకు పైగా ప్రైజ్‌మనీ గెలిచిన జకోవిచ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

