Novak Djokovic | 20 ఏళ్ల టెన్నిస్ కెరీర్.. వెయ్యి కోట్లకు పైగా ప్రైజ్‌మనీ గెలిచిన జకోవిచ్
Novak Djokovic : సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic) దిగ్గజాలకు సైతం సాధ్యం కాని రికార్డును నెలకొల్పాడు. ఫ్రెంచ్ ఓపెన్(French Open)లో విజేతగా నిలిచి అత్యధికంగా 23వ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. అంతేకాదు మళ్లీ వరల్డ్ నంబర్ 1 ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది జకోవిచ్ మూడు సింగిల్స్ టైటిళ్లు సాధించాడు. దాంతో, అతడు ఇప్పటికే రూ. 41 కోట్లు...
Novak Djokovic : సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic) దిగ్గజాలకు సైతం సాధ్యం కాని రికార్డును నెలకొల్పాడు. ఫ్రెంచ్ ఓపెన్(French Open)లో విజేతగా నిలిచి అత్యధికంగా 23వ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. అంతేకాదు మళ్లీ వరల్డ్ నంబర్ 1 ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో గెలిచిన అతను నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరాడు. ఈ ఏడాది జకోవిచ్ మూడు సింగిల్స్ టైటిళ్లు సాధించాడు. దాంతో, అతడు ఇప్పటికే రూ. 41 కోట్లు సంపాదించాడు.
తన 20 ఏళ్ల కెరీర్లో ఈ స్టార్ ప్లేయర్ 94 సింగిల్స్ టైటిళ్లు, ఒక డబుల్స్ ట్రోఫీ గెలిచాడు. ఈ విజయాలకు ప్రతీకగా అతడికి రికార్డు స్థాయిలో ప్రైజ్‌మనీ ముట్టింది. అవును… ఇప్పటి వరకు అతను వెయ్యి కోట్ల( 169, 762, 762 అమెరికన్ డాలర్లు, భారతీయ కరెన్సీలో రూ.13,98,28,49,417)కు పైగా ఆర్జించాడు.
2008లో తొలి గ్రాండ్‌స్లామ్
అభిమానులు ముద్దుగా జోకర్ అని పిలిచే జకోవిచ్ టెన్నిస్ కెరీర్ 20003లో మొదలైంది. ఆ ఏడాది అతను తొలిసారి ఏటీపీ టూర్లో ఆడాడు. అప్పటికే రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ టెన్నిస్ ఆటను శాసిస్తున్నారు. 2008లో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. అక్కడితో మొదలు.. ఫెదరర్, నాదల్కు ప్రధాన పోటీదారుడిగా మారాడు. మెగా టోర్నీల్లో వాళ్లను ఫైనల్లో ఓడించి కొత్త చాంపియన్‌గా అవతరించాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్(2008) ట్రోఫీతో జకోవిచ్

ఆ ఇద్దరు ఆడకపోవడంతో…
గత ఏడాది ఫెదరర్ ఆటకు గుడ్ బై చెప్పడు. నాదల్ ఏమో తొడ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దాంతో, జకోవిచ్‌కు పోటీయే లేకుండా పోయింది. ఈ ఏడాది జనవరిలో అతను ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచి, 22వ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో నాదల్ రికార్డు సమం చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గి, అత్యధికంగా 23 గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ప్రస్తుతం జకోవిచ్ ఖాతాలో 10 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు, 7 వింబుల్డన్ ట్రోఫీలు, మూడేసి చొప్పున యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు సాధించాడు.
ఇవి కూడా చదవండి
Rafael Nadal | టాప్ – 100 నుంచి నాదల్ ఔట్.. 20 ఏళ్లలో ఇదే తొలిసారి
World Cup | వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. హైదరాబాద్‌లో భారత్ మ్యాచ్‌ల్లేవ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

