Rafael Nadal | టాప్ – 100 నుంచి నాదల్ ఔట్.. 20 ఏళ్లలో ఇదే తొలిసారి
Rafael Nadal : మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్(Rafael Nadal)కు గడ్డుకాలం నడుస్తోంది. తొడ కండరాల(Hip injury) గాయం నుంచి పూర్తిగా కోలుకోని అతడికి మరొక షాక్ తగిలింది. పురుషుల టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో అతను టాప్ -100లో కూడా లేడు. నాదల్ ప్రస్తుతం....
Rafael Nadal : మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్(Rafael Nadal)కు గడ్డుకాలం నడుస్తోంది. తొడ కండరాల(Hip injury) గాయం నుంచి పూర్తిగా కోలుకోని అతడికి మరొక షాక్ తగిలింది. పురుషుల టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో అతను టాప్ -100లో కూడా లేడు. నాదల్ ప్రస్తుతం 136వ ర్యాంక్‌కు పడిపోయాడు. ఇంత తక్కువ ర్యాంక్ తెచ్చుకోవడం అతడి 20 ఏళ్ల కెరీర్లో ఇదే మొదటిసారి.
ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian 0pen )లో రఫా గాయపడ్డాడు. దాంతో, అతను ఆ టోర్నీలో రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఈ మధ్యే సర్జరీ చేయించుకున్న అతను రాకెట్ పట్టేందుకు మరో ఐదు నెలల పట్టనుంది. అందుకని నాదల్ తనకెంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. టెన్నిస్ దిగ్గజాల్లో ఒకడైన అతడి ఖాతాలో ప్రస్తుతం 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఉన్నాయి.
ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీతో జకోవిచ్

జకోవిచ్ కొట్టేశాడు
జనవరిలో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic) ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. దాంతో, 22వ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో నాదల్ రికార్డు సమం చేశాడు. రెండు రోజుల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచి టెన్నిస్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. అత్యధికంగా 23 గ్రాండ్‌స్లామ్స్ గెలిచిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. మాజీ ఆటగాడు రోజర్ ఫెదరర్ 20 గ్రాండ్‌స్లామ్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
World Cup | వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. హైదరాబాద్‌లో భారత్ మ్యాచ్‌ల్లేవ్
జులై 4న రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

