ఢిల్లీ: ఈనెల 24 నుంచి మొదలుకాబోయే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో బోర్డుతో కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లందరూ పాల్గొనాల్సిందేనని బీసీసీఐ ఆదేశించింది. టెస్టులు, టీ20ల నుంచి తప్పుకుని వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు మిగిలినవారూ ఆడాల్సిందేనని తెలిపింది.
దక్షిణాఫ్రికాతో చివరి టీ20 (డిసెంబర్ 19) ముగిశాక న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి ప్రారంభం కాబోయే వన్డే సిరీస్‌కు మధ్య సుమారు మూడు వారాల గడువున్న నేపథ్యంలో కాంట్రాక్టు ఆటగాళ్లు వారివారి జట్ల తరఫున కనీసం రెండు విజయ్ హాజారే మ్యాచ్‌లు అయినా ఆడాలని సూచించింది.
న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు వచ్చే ఏడాది జరుగబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకూ ఒకేరోజు జట్టును ప్రకటించే అవకాశమున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. జనవరి మొదటి వారంలో ఈ జట్లను ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం.