టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ సారధి విరాట్ కోహ్లీ ఫామ్ గురించి దిగ్గజ క్రికెటర్ విశ్లేషించాడు. స్టైలిష్ బ్యాటర్‌గా పేరున్న అజారుద్దీన్ మాట్లాడుతూ.. కోహ్లీ ఒక రెండేళ్ల క్రితం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడన్నాడు. ‘‘అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నప్పుడు కోహ్లీని చూసిన వాళ్లకు.. ఇప్పుడు 50లు, 60లు చేసినా అతను ఫామ్‌లోకి వచ్చినట్లు అనిపించదు’’ అని విశ్లేషించాడు.
అలాగే కోహ్లీ టెక్నిక్‌లో ఎలాంటి లోపాలూ లేవని, కానీ ఒక్కోసారి ఆటగాళ్లకు అదృష్టం కూడా కలిసి రావాలని చెప్పాడు. ఇలాంటి పరిస్థితి దాదాపు ప్రతి ఆటగాడికీ వస్తుందని, త్వరలోనే కోహ్లీ కూడా ఈ ఫామ్‌లేమి నుంచి బయటపడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
కోహ్లీ ఒక్క సెంచరీ చేశాడంటే అంతా మారిపోతుందన్నాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో మళ్లీ మునుపటి ఎగ్రెషన్, కాన్ఫిడెన్స్ వచ్చేస్తాయని వివరించాడు. మరి ఇంగ్లండ్ పర్యటనలోనైనా మునుపటి కోహ్లీ కనిపిస్తాడేమో చూడాలి.