Erling Haaland : ఇంగ్లండ్ యువ ఫుట్‌బాలర్ ఎర్లింగ్ హాలాండ్(Erling Haaland) సంచలనం సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక ప్రీమియర్ లీగ్(Premier League) చరిత్రలో వేగంగా 50 గోల్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. గతంలో ఆండీ కొలే(Andy Cole) నెలకొల్పిన రికార్డును హాలాండ్ బద్ధలు కొట్టాడు. ఆండీ 65 మ్యాచుల్లో 50వ గోల్ కొట్టగా.. ఈ యంగ్‌స్టర్ 48 మ్యాచుల్లోనే ఈ మైలురాయికి చేరడం విశేషం.
మాంచెస్టర్ సిటీ(Manchester City)కి ఆడుతున్న 23 ఏండ్ల హాలాండ్ శనివారం లివర్‌పూల్(Liverpool)తో మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. ఆట మొదలైన 27వ నిమిషంలో హాలాండ్ సూపర్ గోల్‌తో మాంచెస్టర్ ఆధిక్యాన్ని 1-0కు పెంచాడు. అయితే.. 80వ నిమిషంలో లివర్‌పూల్ ఆటగాడు ట్రెంట్ అలెగ్జాండర్ గోల్ చేసి స్కోర్ సమం చేశాడు. ఆ తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు గోల్ కొట్టేందుకు ప్రయత్నించినా చివరకు 1-1తో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
5️⃣0️⃣ goals in 4️⃣8️⃣ @premierleague games for @ErlingHaaland! ✨
Superb from @NathanAke to set him up! 💪 pic.twitter.com/mCYo3b3TSs
— Manchester City (@ManCity) November 25, 2023
ప్రీమియర్ లీగ్‌లో హాలాండ్ కంటే ముందు ఐదుగురు 50 గోల్స్ కొట్టారు. అలన్ షీరర్(66 మ్యాచ్‌లు), రూడ్ వాన్ నిస్టెల్రూయ్(68 మ్యాచ్‌లు), ఫెర్నాండో టోరస్, మహమ్మద్ సలాహ్ ఇద్దరూ 72 మ్యాచుల్లో 50వ గోల్ కొట్టారు. ఈ ఏడాది హోలాండ్ 20 మ్యాచుల్లో ఏకంగా 18 గోల్స్ చేశాడు. ప్రీమియర్ లీగ్‌లో ఆడిన 13 మ్యాచుల్లోనే అతడు 14 గోల్స్ సాధించడం విశేషం.