Raw Coconut | తరచూ పచ్చికొబ్బరి తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా..?
Raw Coconut | పచ్చి కొబ్బరి..! కొందరు ఈ పచ్చికొబ్బరిని చాలా ఇష్టంగా తింటారు. అల్పాహారాల్లో వేసుకునే చట్నీగా, తీపి వంటకంగా పచ్చికొబ్బరిని వినియోగిస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం దగ్గు వస్తుందని, బరువు పెరుగుతామని, ఒంట్లో చెడు కొవ్వు పెరుగుతుందని భయంతో ఈ పచ్చి కొబ్బరిని దూరం పెడుతారు. మరె నిజంగానే పచ్చికొబ్బరితో ఆరోగ్య సమస్యలు వస్తాయా..? శరీరంలో చెడు కొవ్వు పేరుకపోతుందా..? అంటే.. ఆరోగ్య నిపుణులు కాదని చెబుతున్నారు. పైగా పచ్చి కొబ్బరిని తరచూ తగిన మోతాదులో తీసుకుంటే చాలా అనారోగ్య సమస్యలు దూరమవుతాయంటున్నారు. పచ్చి కొబ్బరి యాంటీ బయోటిక్‌గా పని చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి పచ్చి కొబ్బరితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పచ్చి కొబ్బరి..! కొందరు ఈ పచ్చికొబ్బరిని చాలా ఇష్టంగా తింటారు. అల్పాహారాల్లో వేసుకునే చట్నీగా, తీపి వంటకంగా పచ్చికొబ్బరిని వినియోగిస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం దగ్గు వస్తుందని, బరువు పెరుగుతామని, ఒంట్లో చెడు కొవ్వు పెరుగుతుందని భయంతో ఈ పచ్చి కొబ్బరిని దూరం పెడుతారు. మరె నిజంగానే పచ్చికొబ్బరితో ఆరోగ్య సమస్యలు వస్తాయా..? శరీరంలో చెడు కొవ్వు పేరుకపోతుందా..? అంటే.. ఆరోగ్య నిపుణులు కాదని చెబుతున్నారు. పైగా పచ్చి కొబ్బరిని తరచూ తగిన మోతాదులో తీసుకుంటే చాలా అనారోగ్య సమస్యలు దూరమవుతాయంటున్నారు. పచ్చి కొబ్బరి యాంటీ బయోటిక్‌గా పని చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి పచ్చి కొబ్బరితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
రోగ నిరోధక శక్తి వృద్ధి
పచ్చి కొబ్బరిని తరచూ తింటూ ఉంటే శరీంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో శరీరం వైరస్, బ్యాక్టీరియాలతో సమర్థంగా పోరాడుతుంది. ఇన్ఫెక్షన్ల బారినపడే ప్రమాదం తప్పుతుంది.
మంచి కొలెస్ట్రాల్ పెంపు
పచ్చి కొబ్బరిని తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దాంతో రక్తంలో ఎలాంటి మలినాలు ఏర్పడవు. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
జీర్ణశక్తికి ఊతం
పచ్చి కొబ్బరిలో పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దాంతో జీర్ణ సంబంధ సమస్యలు కూడా త్వరగా రావు. అలాగే మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.
అదుపులో థైరాయిడ్
చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధ పడుతూంటారు. ఇలాంటి వారికి పచ్చి కొబ్బరి బాగా సాయపడుతుంది. పచ్చి కొబ్బరిలో ఉండే పోషకాలు థైరాయిడ్ ను తగ్గిస్తాయి.
మెదడు ఆరోగ్యం
తరచూ పచ్చి కొబ్బరి తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. చురుగ్గా పని చేస్తుంది. అల్జీమర్స్ లాంటి తీవ్రమైన మతిమరుపు సమస్యలు రాకుండా ఉంటాయి.
పిల్లల ఎదుగుదలకు
ఎదిగే పిల్లలకు పచ్చి కొబ్బరి చాలా మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరితో వారికి కావాల్సిన పోషకాలు అందుతాయి. దాంతో పిల్లల్లో ఎదుగుదల చక్కగా ఉంటుంది. రక్త హీనత సమస్య తగ్గుతుంది. అలాగే చిన్న వయసులోనే ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. కావాల్సిన శక్తి లభిస్తుంది.
చర్మ సౌందర్యం
పచ్చి కొబ్బరి తరచూ తినడం వల్ల చర్మం, కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. చర్మం కాంతివంతమవుతుంది. వృద్ధాప్య ఛాయలు తొందరగా దరి చేరకుండా ఉంటాయి. జుట్టు రాలే సమస్య ఆగిపోతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

