Ben Stokes : ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) ఇప్పట్లో జట్టుతో కలిసి మైదానంలో దిగేలా లేడు. సొంతగడ్డపై శ్రీలకంతో రెండు టెస్టుల సిరీస్‌కు దూరమైన అతడు ఇప్పుడు పాకిస్థాన్(Pakistan)లో ఆడడం అనుమానంగానే ఉంది. ఈమధ్యే తొడ కండరాల గాయం (Harmstring Injury) నుంచి కోలుకున్న స్టోక్స్ పాక్ పర్యటనకు ఎంపికైనా తొలి టెస్టుకు దూరమయ్యాడు. రెండో టెస్టుకైనా స్టోక్స్ అందుబాటులో ఉంటాడని ఆశించిన ఇంగ్లీష్ జట్టుకు పెద్ద షాక్ తగలనుంది.
పాకిస్థాన్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికైన స్టోక్స్ తొలి టెస్టులో బరిలోకి దిగలేదు. ముల్తాన్‌లోనే జరిగే రెండో టెస్టులో సైతం తాను ఆడుతానా? లేదా? అనేది తెలియదని స్టోక్స్ స్వయంగా చెప్పాడు. ‘నాకెంతో ఇష్టమైన టెస్టు క్రికెట్‌కు దూరమవ్వడం చిరాకు తెప్పిస్తోంది. తొలి టెస్టు ఆడేందుకు నేను శతవిధాలా ప్రయత్నించాను. కానీ వీలు పడలే.
Does Ben Stokes have the best shades game in cricket? 😎 pic.twitter.com/l62aTy0V13
— Sport360° (@Sport360) October 4, 2024
నేను ప్రస్తుతం ఆటకు సిద్ధంగా లేను. నా రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఇంకొన్ని రోజులు కొనసాగనుంది. కొన్ని విషయాల మీద దృష్టి పెట్టాల్సి ఉంది. స్క్వాడ్‌తో పాటు పాకిస్థాన్‌కు అయితే వచ్చాను. కానీ..మానసికంగా మాత్రం సిద్ధంగా లేను. ఈ 10 రోజుల విరామంలో పూర్తిగా సన్నద్ధమవుతాను’ అని స్టోక్స్ వెల్లడించాడు.
Ben Stokes has been ruled out of the first Test in Multan due to torn hamstring .. He is still im the stage of recovery.. Ollie Pope will lead Eng Team ..
Today Stokes took part in only physical training 👇#PAKvENG #ENGvPAK pic.twitter.com/dEmPH72wOl
— Shakeel Khan Khattak (@ShakeelktkKhan) October 5, 2024
టీ20 వరల్డ్ కప్ అనంతరం స్వదేశంలో జరిగిన హండ్రెడ్ లీగ్ లీగ్‌లో స్టోక్స్ గాయపడ్డాడు. దాంతో, శ్రీలంకతో రెండు టెస్టుల కోసం సెలెక్టర్లు ఓలీ పోప్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా ప్రకటించారు. ఈలోపు ఆరోగ్యం మెరుగపడంతో స్టోక్స్ నెట్స్‌లో సాధన చేసి ఫిట్నెస్ సాధించాడు. అందుకని అతడిని పాకిస్థాన్ పర్యటనకు బోర్డు ఎంపిక చేసింది. తీరా.. పాక్‌కు వచ్చాక నేను ఆడలేనంటూ స్టోక్స్ జట్టుకు పెద్ద షాకిచ్చాడు. ఇంకేముంది.. పోప్ మరోసారి సారథి అవతారం ఎత్తాల్సి వచ్చింది. పాక్, ఇంగ్లండ్‌ల మధ్య ముల్తాన్‌లో అక్టోబర్ 15 నుంచి 19 వరకూ రెండో టెస్టు జరుగనుంది.