Peter Lever : ప్రపంచ క్రికెట్లో విషాదం నెలకొంది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ పీటర్ లెవర్(Peter Lever) కన్నుమూశాడు. 84 ఏళ్ల వయసున్న పీటర్ అనారోగ్యంతో మార్చి 27న మరణించాడు. దాంతో, ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు సంతాపం తెలియజేస్తున్నారు. తొలితరం పేస్ బౌలర్లలో ఒకడైన పీటర్ ఇంగ్లండ్ తరఫున ఆడింది తక్కువ మ్యాచులే. కానీ, ఆడినన్ని రోజులు తన ముద్ర వేశాడీ పేస్ గన్.
దేశవాళీలో, కౌంటీల్లో లాంక్షైర్ జట్టుకు ఆడిన పీటర్ తన పేస్ పవర్ చూపించాడు. తన ప్రతభతో ఇంగ్లండ్ జట్టుకు ఎంపికైన అతడు 17 టెస్టులు, 10 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 36.80 సగటుతో 41 వికెట్లు కూల్చిన ఈ స్పీడ్‌స్టర్ .. రెండు ఫార్మాట్లలో కలిపి 52 వికెట్లు పడగొట్టాడు. ఇక బ్యాటుతోనూ రాణించి 350 పరుగులు సాధించాడు.
We are deeply saddened by the news that Peter Lever has passed away, aged 84.
Peter was inducted into our Hall of Fame last year after playing 301 First-Class matches between 1960 and 1976 – taking 796 wickets.
Our thoughts are with his family and friends.
🌹 #RedRoseTogether pic.twitter.com/5JuAXNB07j
— Lancashire Cricket Men (@lancscricket) March 27, 2025
పీటర్ మృతిపట్ల విచారం వ్యక్తం చేసింది ల్యాంక్‌షైర్ క్రికెట్ క్లబ్. 1960 నుంచి 1976 మధ్యకాలంలో పీటర్ 301 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడని, 796 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడని ఎక్స్ పోస్ట్‌లో తెలిపింది. పీటర్ కెరియర్లో 1975 సంవత్సరానికి ఓ ప్రత్యేకత ఉంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆ ఏడాది తొలిసారి వన్డే వరల్డ్ కప్ పోటీలు నిర్వహించింది. ఆ ప్రపంచ కప్ ఆడిన ఇంగ్లండ్ జట్టులో సభ్యుడైన పీటర్‌కు.. ఆ టోర్నీనే ఆఖరిది అయింది.