చివ్వెంల, మర్చి 28 : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల మండల పరిధిలోని ఉండ్రుగొండ గిరిదుర్గంలో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో నెలకొన్న ఉమా మహేశ్వర ఆలయంలో శుక్రవారం ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు. క్రోది నామ సంవత్సరం ఫాల్గుణ మాస శివరాత్రి సందర్భంగా మంత్రమూర్తి మనోహర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.