Graham Thorpe : ఇంగ్లండ్ క్రికెట్లో విషాదం నెలకొంది. ఆ దేశ మాజీ ఆల్రౌండర్ గ్రాహమ్ థోర్పె(Graham Thorpe) కన్నుమూశాడు. 55 ఏండ్ల వయసులో గ్రాహమ్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాడు. ఈమధ్యే తీవ్ర అనారోగ్య పాలైన గ్రాహమ్ను కుటుంబసభ్యులు దవాఖానకు తరలించారు. అయితే.. అక్కడ వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించినా ఈ మాజీ క్రికెటర్ ప్రాణాలు కాపాడలేకపోయారు. అయితే.. అతడి మృతికి కారణాలు ఏంటీ? అనేది తెలియాల్సి ఉంది. గ్రాహమ్ అకాల మరణం పట్ల ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు క్రికెట్, సర్రీ క్రికెట్లు సంతాపం తెలిపాయి.
గ్రాహమ్ ఇంగ్లండ్ అత్యుత్తమ బ్యాటర్ మాత్రమే కాదు ప్రపంచంలోని అభిమానుల మనసు గెలిచిన క్రికెటర్ కూడా. అతడి నైపుణ్యం చాలా విభిన్నమైనది. 13 ఏండ్ల కెరీర్లో గ్రాహమ్ ఇంగ్లండ్ జట్టులో సంబురాలు నింపాడు. అనంతరం కోచ్గానూ ఇంగ్లండ్ జట్టును మూడు ఫార్మాట్లలో విజేతగా నిలిపాడు అని ఇంగ్లండ్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.
“He brought much joy to fans of English cricket, and that will live with them forever as they remember a man who gave so much to the game.”
Our obituary to Graham Thorpe, who has passed away aged 55.
Click on the image below to read ⬇️
— England and Wales Cricket Board (@ECB_cricket) August 5, 2024
లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన గ్రాహమ్ ఇంగ్లండ్ తరఫున 182 మ్యాచ్లు ఆడాడు. 1993లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన గ్రాహమ్ తన రాకను ఘనంగా చాటాడు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన యాషెస్ టెస్టులో సెచంరీతో చెలరేగాడు. తన 13 ఏండ్ల కెరీర్లో ఈ ఆల్రౌండర్ 100 టెస్టుల్లో, 82 వన్డేల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 16 సెంచరీలతో కలిపి 6,744 పరుగులు సాధించాడు. ఇక వన్డేల్లో 2,380 రన్స్ కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాక ఇంగ్లండ్ పురుషుల జట్లు బ్యాటింగ్ కోచ్గానూ గ్రాహమ్ సేవలందించాడు.