ఓవల్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 181 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 369 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కివీస్ 39 ఓవర్లలో 187 పరుగులకు కుప్పకూలింది. లివింగ్‌స్టోన్ (3/16), వోక్స్(3/31), రెకీ టోప్లె(2/31) ధాటికి కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్(72) మినహా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. 18 పరుగులకే ఓపెనర్ విల్‌యంగ్ (12) వికెట్ కోల్పోయిన కివీస్..ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఫిలిప్స్, రవీంద్ర(28) పోరాడినా ఫలితం లేకపోయింది. అంతకుముందు ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్(182) రికార్డు సెంచరీతో ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 368 పరుగులు చేసింది. మలన్(96) రాణించాడు. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో స్టోక్స్‌దే అత్యధిక స్కోరు కావడం విశేషం. బౌల్ట్(5/51)ఐదు వికెట్లు దక్కించుకున్నాడు. స్టోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.