England XI | టీమిండియాతో రేపే తొలి టీ20.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన..!
England XI : స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్(England) టీ20 పోరుకు సై అంటోంది. భారత జట్టుతో ఐదు టీ20లు ఆడనుంది ఆతిథ్య జట్టు.
England XI : స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్(England) టీ20 పోరుకు సై అంటోంది. భారత జట్టుతో ఐదు టీ20లు ఆడనుంది ఆతిథ్య జట్టు. జూలై 1 బుధవారం నుంచే ఇరుజట్ల మధ్య పొట్టి సమరం మొదలవ్వనుంది. దాంతో, మంగళవారం ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) తుది జట్టును ప్రకటించింది. హ్యారీ బ్రూక్ (Harry Brook) సారథిగా 11 మందితో కూడిన బృందంలో స్పిన్నర్లుగా ఆదిల్ రషీద్, లియాం డాసన్‌లు ఎంపికయ్యారు.
సొంతగడ్డపై బజ్ బాల్ వ్యూహం బెడిసికొట్టడంతో న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్న ఇంగ్లండ్ టీ20ల్లో భారత జట్టును ఢీకొట్టనుంది. టీమిండియాతో ఐదు మ్యాచుల సిరీస్ జూలై 1 బధువారం నుంచి మొదలవ్వనుంది. అందుకని ఆనవాయితీని కొనసాగిస్తూ.. ఒకరోజు ముందుగానే ఇంగ్లండ్, వేల్స్ బోర్డు పదకొండు మందిని ఎంపిక చేసింది.
JUST IN: England announce their XI to play India in the first T20I tomorrow 🏴 pic.twitter.com/q21cZpcwpt
— Cricinfo (@cricinfo) June 30, 2026
ఓపెనర్లుగా ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ .. మిడిలార్డర్లో కెప్టెన్ హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్ ఆడనున్నారు. పేస్ ఆల్‌రౌండర్‌గా సాయ్ కరన్.. స్పిన్నర్లుగా డాసన్, రషీద్ ఎంపికయ్యారు. పేస్ దళంలో ల్యూక్ వుడ్, సకీబ్ మహమూద్ ఉన్నారు. ఇక.. చిన్న జట్టైన ఐర్లాండ్ చేతిలో ఊహించని విధంగా 2-0తో సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇంగ్లండ్ గడ్డపై గర్వించదగ్గ ప్రదర్శన చేయాలనుకుంటోంది.
ఇంగ్లండ్ తుది జట్టు : ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బ్యాంటన్, సాయ్ కరన్, విల్ జాక్స్, లియాం డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్, సకీబ్ మహమూద్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

