బ్రిస్బేన్: టీ20 వరల్డ్‌కప్‌లో ఇవాళ న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఇంగ్లండ్‌కు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదని ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ తెలిపాడు. ఒకవేళ టాస్ గెలిస్తే తాము కూడా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ చెప్పాడు. ఆ జట్టు కూడా ఎటువంటి మార్పులు చేయలేదు.