England vs India | భారత్-ఇంగ్లండ్ మధ్య ఆదివారం లార్డ్స్ మైదానంలో జరిగే మూడో, చివరి వన్డేలో వరుసగా టాస్ నెగ్గిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రెండు మ్యాచ్‌ల తర్వాత సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో, ఇరు జట్లకూ ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. మోకాలు గాయం కారణంగా బుమ్రా మ్యాచ్‌కు దూరమయ్యాడు.
నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, కేఎల్ రాహుల్ జట్టులోకి తిరిగి రాగా శివం దూబే బెంచ్‌కే పరిమవ్వగా బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. సుందర్‌కు బదులు ప్రిన్స్ యాదవ్ చటు దక్కించుకున్నాడు.
కాగా, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై తీవ్ర ఊహాగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఈ మ్యాచ్ అతడికి అత్యంత కీలకంగా మారింది. రోహిత్‌కు ఇది చివరి అంతర్జాతీయ మ్యాచ్ కాదని బీసీసీఐ స్పష్టం చేసినప్పటికీ అతని ఆటతీరుపైనే అందరి దృష్టి ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన 39 ఏండ్ల రోహిత్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ వరకు అతడు ఆడగలడా అనే చర్చ మొదలైంది.