Paramedical Student | ఇంట్లోని గదిలో విద్యార్థి మృతి.. మూడు రోజుల తర్వాత మృతదేహం గుర్తింపు
Paramedical Student | ఒక పారామెడికల్ విద్యార్థి తన ఇంట్లోని గదిలో అనుమానాస్పదంగా మరణించాడు. మూడు రోజుల తర్వాత ఆ గది నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించారు. సీలింగ్‌కు వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని చూసి వారు షాక్ అయ్యారు.
బెంగళూరు: ఒక పారామెడికల్ విద్యార్థి తన ఇంట్లోని గదిలో అనుమానాస్పదంగా మరణించాడు. మూడు రోజుల తర్వాత ఆ గది నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించారు. సీలింగ్‌కు వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని చూసి వారు షాక్ అయ్యారు. (Paramedical Student) ఆ వ్యక్తి తండ్రితో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. మారప్పనపాళ్యకు చెందిన20 ఏళ్ల ఉదయ్ గౌడ పారామెడికల్ కోర్సు చదువుతున్నాడు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఒక గదిలో అనుమానాస్పదంగా మరణించాడు.
కాగా, ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గుర్తించారు. ఉదయ్ కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఆ గదిని తెరిచి చూడగా ఉరికి వేలాడుతూ అతడి మృతదేహం కనిపించింది. మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉండటంతో మూడు రోజుల కిందట మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం ఉదయ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు తన కుమారుడు ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు కాలేజీకి వెళ్ళి రాత్రి 11 గంటలకల్లా ఇంటికి తిరిగి వచ్చేవాడని ఉదయ్ తండ్రి తెలిపారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా తాను నాలుగు రోజులుగా ఇంటికి దూరంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఆ సమయంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు. ఉదయ్ ఇటీవల తిరుపతికి వెళ్లి వచ్చినట్లు వివరించారు. తన కుమారుడి ఆత్మహత్యకు కారణం ఏమిటన్నది తమకు తెలియని ఆయన అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

