వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు వరుస విజయాలతో టెస్టు సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్టులో బెన్ స్టోక్స్ సేన 323 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆతిథ్య జట్టు ఎదుట 583 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిలపగా.. కివీస్ 54.2 ఓవర్లలో 259 పరుగులకే కుప్పకూలింది.
టామ్ బ్లండెల్ (115), నాథన్ స్మిత్ (42) మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 378/5తో మూడో రోజు బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లీష్ జట్టు.. రెండో ఇన్నింగ్స్లో 427/6 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. రికార్డుల వీరుడు జో రూట్ (106) మరో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బౌలింగ్లో స్టోక్స్ (3/5), వోక్స్ (2/20), కార్స్ (2/53) రాణించారు.