England | సెయింట్లుసియా: వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లండ్ అదరగొట్టింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఆ జట్టు 3-1తో గెలుచుకుంది. తొలి మూడు మ్యాచ్లలో పర్యాటక జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో జయకేతనం ఎగురవేయగా నాలుగో టీ20లో వెస్టిండీస్ నెగ్గింది.
ఆదివారం జరిగిన చివరి టీ20 వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దయింది. అంతకుముందు విండీస్.. మూడు వన్డేల సిరీస్ను 2-1తో దక్కించుకుంది. ఇంగ్లండ్ బౌలర్ సకీబ్కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.