నాటింగ్‌హామ్: జింబాబ్వేతో ఏకైక టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ పరుగుల వరద పారిస్తున్నది. టాస్ గెలిచిన జింబాబ్వే..ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తాము తప్పు చేశామని తెలుసుకోవడానికి జింబాబ్వేకు పెద్దగా సమయం పట్టలేదు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ను తలపిస్తూ ఇంగ్లండ్ టాప్-3 బ్యాటర్లు ఒలీపోప్(169 నాటౌట్), డకెట్(140), క్రాలె(124) సెంచరీలతో విరుచుకుపడ్డారు.
పసలేని జింజాబ్వే బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ పరుగుల వరద పారించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లకు 498 పరుగులు చేసింది. జోరూట్(34) టెస్టుల్లో 13వేల మైలురాయిని అందుకోవడం విశేషం. పోప్‌తో పాటు, బ్రూక్ క్రీజులో ఉన్నారు.