ENG Vs ING | ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ఓలీ పోప్ను హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 34 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో 27 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ప్రస్తుతం జో రూట్ క్రీజులో ఉండగా.. అతనిలో హ్యారీ బ్రూక్ జత కలిశాడు. టీమిండియా విధించిన 374 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇంగ్లండ్ ఎదురీదుతున్నది. ఈ మ్యాచ్లో గెలవాలంటే ఇంకా 268 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను డ్రాగా ముగించాలని టీమిండియా భావిస్తున్నది.