ENG vs USA : టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియిన్ ఇంగ్లండ్ (England) సెమీస్ రేసులో వెనకబడింది. గ్రూప్ 2 సూపర్ 8 తొలి పోరు ఆతిథ్య వెస్టిండీస్ (West Indies)ను చిత్తుగా ఓడించిన బట్లర్ సేన మలిపోరులో దక్షిణాఫ్రికా (South Africaa)పై తడబడింది. దాంతో, అమెరికాతో ఆదివారం జరిగే మ్యాచ్ ఇంగ్లండ్‌కు చావోరేవో లాంటిది. అయితే.. జూన్ 24న బార్బడోస్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. సోమవారం బార్బడోస్‌లో భారీ వాన పడనుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఒకవేళ వర్షం కారణంగా గేమ్ రద్దయితే ఇరుజట్లకు ఒక్కో పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు ఇంగ్లండ్ పాయింట్ల సంఖ్య మూడుకు చేరుతుంది. ఆ పరిస్థితుల్లో బట్లర్ బ్యాచ్ ఆశలన్నీ వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై పెట్టుకోవాల్సిందే. అందులో రొవ్మన్ పావెల్ బృందం అజేయంగా దూసుకెళ్తున్న సఫారీ జట్టుకు చెక్ పెడితే ఇంగ్లండ్ రేసులో నిలుస్తుంది.
Carrying the hopes of his nation 👊
England’s number five, Harry Brook, raises the bat upon reaching a maiden @MyIndusIndBank Milestone of the #T20WorldCup 2024 👏#ENGvSA pic.twitter.com/j3aBbWKtI4
— ICC (@ICC) June 21, 2024
అలాకాకుండా విండీస్ గెలిస్తే ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించండం ఖాయం. ఉత్కంఠ పోరులో బట్లర్ సేనపై అద్భుత విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. సెయింట్ లూయిస్‌లో 163 పరుగుల ఛేదనలో హ్యారీ బ్రూక్(53), లివింగ్‌స్టోన్(33)లు కడదాకా పోరాడినా ఓటమి తప్పలేదు. రబడ, నోర్జిలు ఒత్తిడిలోనూ కీలక వికెట్లు తీయడంతో మర్క్రమ్ బృందం 7 పరుగులతో గెలిచింది. ఇక రెండో స్థానం కోసం వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య గట్టి పోటీ నెలకొంది.
The Proteas have clinched a thriller 🤩🇿🇦
A remarkable bowling effort helps South Africa stay unbeaten in the #T20WorldCup 2024 🔥#ENGvSA | 📝: https://t.co/B2JSqzDbSU pic.twitter.com/WORk8Rv3aF
— ICC (@ICC) June 21, 2024