Sam Cook : దేశం తరఫున ఆడాలనుకున్న ఇంగ్లండ్ యువ పేసర్ సామ్ కుక్(Sam Cook) కల ఫలించింది. పసికూన జింబాబ్వేతో జరుగబోయే ఏకైక టెస్టుకు ఈ కుడి చేతివాటం బౌలర్ ఎంపికయ్యాడు. అతడితో పాటు మరో కుర్రాడు జోర్డాన్ కాక్స్(Jordan Cox) సైతం స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. కౌంటీల్లో ఐదేసి వికెట్లతో విజృంభించిన స్పీడ్‌స్టర్ జోష్ టంగ్(Josh Tongue)ను కూడా సెలక్టర్లు 13మందితో కూడిన బృందానికి ఎంపిక చేశారు.
శుక్రవారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు టెస్టు స్క్వాడ్‌ను ప్రకటించింది. 25 ఏళ్ల తర్వాత జింబాబ్వే జట్టు ఇంగ్లండ్ గడ్డపై ఆడుతున్న తొలి టెస్టు ఇది. అందుకే.. ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కౌంటీల్లో నిలకడగా రాణిస్తున్న సామ్ కుక్ జింబాబ్వే టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేయనున్నాడు. బుల్లెట్ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించే ఈ పేసర్.. కౌంటీల్లో ఇప్పటివరకూ 318 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా ఏ తో ఇంగ్లండ్ లయన్స్ డౌన్ అండర్ జట్టు ఆడిన మ్యాచుల్లో కుక్ 13 వికెట్లతో చెలరేగాడు.
Uncapped Essex duo Sam Cook and Jordan Cox are included in England’s 13-man squad for the one-off Test against ZImbabwe at Trent Bridge
Josh Tongue makes a return to the squad having last featured during the Ashes in 2023 pic.twitter.com/PDQfNPAxQo
— ESPNcricinfo (@ESPNcricinfo) May 2, 2025
వికెట్ కీపర్, బ్యాటర్ అయిన జోర్డాన్ కాక్స్ విషయానికొస్తే.. అతడు 2024 నవంబర్లోనే అంతర్జాతీయంగా అరంగేట్రం చేయాల్సింది. కానీ, కుడిచేతి బొటనవేలికి గాయం కావడంతో అతడి డెబ్యూట్ వాయిదా పడింది. విశ్రాంతి అనంతరం పూర్తిగా కోలుకున్న కాక్స్ ఈమధ్యే ఫిట్నెస్ సాధించాడు.
ఇంగ్లండ్ స్క్వాడ్ : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోర్డాన్ కాక్స్(వికెట్ కీపర్), సామ్ కుక్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్.
రెండేళ్ల క్రితం యాషెస్ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడిన జోష్ టంగ్.. ఆ తర్వాత గాయాలపాలయ్యాడు. దాంతో, ఆస్ట్రేలియాలో లార్డ్స్‌లో ఆడిన టెస్టు అతడికి ఆఖరిది అయింది. అయితే.. కోలుకున్న అనంతరం బంతితో బెంబేలెత్తించాడీ పేసర్. ఈమధ్యే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో 14 వికెట్లతో అదరహో అనిపించాడు. జూన్‌లో టీమిండియా పర్యటనను దృష్టిలో ఉంచుకున్న సెలెక్టర్లు టంగ్‌ను జింబాబ్వే టెస్టుకు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
Two Notts stars in the Three Lions for the Trent Bridge Test 🦁
Ben Duckett and Josh Tongue are in the England squad to face Zimbabwe later this month.
🗞️ https://t.co/n4a7VmrS7X pic.twitter.com/CtgrBw6CBu
— Nottinghamshire CCC (@TrentBridge) May 2, 2025
ఇంగ్లండ్ గడ్డపై దాదాపు 23 సొంతగడ్డపై జింబాబ్వే పని పట్టేందుకు బెన్ స్టోక్స్ కాచుకొని ఉంది. ఎందుకంటే.. బెన్ డకెట్, క్రాలే, హ్యారీ బ్రూక్, జో రూట్, జేమీ స్మిత్‌లు ఉండడంతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. మే 21న నాటింగ్హమ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో మ్యాచ్ నిర్వహించనున్నారు. చివరిసారిగా 2003లో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు ఆడిన జింబాబ్వే.. 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ కాలుమోపనుంది.