Janu Lyri | యూట్యూబ్ లో ఫోక్ సాంగ్ వీడియోలతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది డాన్సర్ జాను లిరి. ఢీ డాన్స్ షోలో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో విజేతగా కూడా నిలిచింది. ఆమె పాటలు, డ్యాన్సులు అందరికి తెగ నచ్చేసేవి. అయితే సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకున్న తాను తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేస్తూ తన ఆవేదన తెలియజేసింది. తనకు ఓ కొడుకు ఉన్నాడని.. తనకు ఇతరులతో సంబంధాలు అంటగట్టడం బాధగా ఉందంటూ ఆ వీడియోలో వెక్కి వెక్కి ఏడవడం మనం చూడవచ్చు. వీడియోలో ముందుగా జాను లిరి.. ‘నమస్తే.. బాగున్నారు కదా అందరూ.. బాగానే ఉంటారు. ఎందుకంటే పక్కోని జీవితంతో ఆడుకున్నోళ్లంతా బాగానే ఉంటారు.
జాను నవ్వితే తప్పు.. జాను ఏడిస్తే తప్పు. జాను ఒకరితో మాట్లాడితే తప్పు. జాను కూర్చుంటే తప్పు.. జాను నిలబడితే తప్పు. జాను నవ్వితే చాలు ఓవరాక్షన్ అంటున్నారు. జాను పద్దతిగా ఉండదు. పద్దతి నేర్చుకోవాలి. ఇండస్ట్రీలో పద్దతిగా చీరకట్టుకుని పద్దతిగా ఉన్నది నేనొక్కదాన్నే. ఫస్ట్ అమ్మాయిని నేనే. జాను ఆన్ కెమెరా ఒకలా.. ఆఫ్ కెమెరా మరోలా ఉండదు. నేను అందరితోనూ నవ్వుతూ మంచిగా ఉంటా. వాళ్లు ఎంత పెద్దోళ్లైనా సరే.. చిన్నోళ్లైనా సరే.. వాళ్లతో మంచిగానే మాట్లాడతా. అలాంటి నా గురించి తప్ప వేరే మ్యాటరే ఉండటం లేదు. ఎందుకు నా పర్సనల్ లైఫ్‌ని తీసుకొచ్చి ఇంత హైలైట్ చేస్తున్నారు? దేని కోసం నన్ను టార్గెట్ చేస్తున్నారు?
మాట్లాడితే చాలు జానుకి రెండో పెళ్లి. నా ఫొటో పెట్టడం.. నా రెండో పెళ్లి గురించి రాసేయడం. ఆడోళ్లూ, మగోళ్లూ.. న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా? ఒక ఆడపిల్లకి మరో ఆడపిల్ల బాధ తెలుస్తుంది అనుకున్నా. మీరు కూడా ఇంతేనా? అసలు పర్సనల్ లైఫ్‌ని ఎందుకు తీస్తున్నారు. మీకు జాను లిరి తప్ప వేరే టాపిక్‌లు లేవా? ఎవరో గుడికిపోతే రేప్ చేసి చంపేశారట. ఆ అమ్మాయి గురించి మాట్లాడొచ్చు కదా. ఆ ఎదవల గురించి మాట్లాడొచ్చు కదా.. చిన్న పిల్లల్ని చంపేస్తున్నారు వాళ్ల గురించి మాట్లాడొచ్చు కదా. సరే నా గురించి మాట్లాడితే మంచిగా మాట్లాడొచ్చు కదా. నాలో మంచి ఉంది కదా.8 ఏళ్లుగా ఒక కొడుకుని పెంచుకుంటుంది. చాలా పద్దతిగా ఉంటుంది అని మంచి చెప్పొచ్చు కదా?
ఇన్‌స్టాగ్రామ్‌లో నా వీడియోలకి గలీజ్ గలీజ్ వాయిస్‌లు పెడుతున్నారు. వాటిని నా కొడుకు చూడడా? నువ్వూ ఒక అమ్మకి పుట్టినోడివే కదా. నీ అమ్మ వీడియోను కూడా అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకెంత బాధ ఉంటుందో.. అంతకంటే ఎక్కువ బాధ ఉంది. ఫస్ట్ టైమ్ అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని. నిజంగా నా లైఫ్‌లో ఏమీ లేకుండా ఉండి ఉంటే.. ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేదాన్ని. నేను చచ్చిపోతే కారణం మీరే అవుతారు. ఇది బాగా గుర్తు పెట్టుకోండి.ఇంత నరకమా? చాలా విషయాలు ఉన్నాయి కదా.. నాపై పడిఏడుస్తారెందుకు? అసలు మీకేం వస్తుంది. నేను చచ్చాక కూడా నా శవం దగ్గర మైక్‌లు పెట్టి.. ఎందుకు చచ్చిపోయిందో తెల్సా.. ఎందుకు చచ్చిపోయిందో తెల్సా అని అడుగుతారు. . ఎందుకు చనిపోవడం ధైర్యంగా బతకాలని చెప్పేదాన్ని. అలాంటి నాకే చచ్చిపోవాలనిపించేటంత నరకం చూపిస్తున్నారు. ఇక నేను బతకలేను అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది జాను.