Pak cricketers : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో పాకిస్థాన్ (Pakistan) కు ఉచ్చు బిగించేలా భారత్ (India) పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధూ జలాల నిలిపివేత, పాకిస్థాన్‌కు రాకపోకలు సాగించే విమానాలకు భారత గగనతలం మూసివేత లాంటి పలు నిర్ణయాలు తీసుకుంది. తాజాగా పాకిస్థాన్ ప్రధాని ఇన్‌స్టా ఖాతాను బ్లాక్ చేసింది. ఇప్పుడు పాకిస్థాన్‌కు చెందని ముగ్గురు ప్రముఖ క్రికెటర్ల (Cricketers) ఇన్‌స్టా ఖాతాల (Insta accounts) ను కూడా భారత్ బ్లాక్ లిస్టులో పెట్టింది.
తాజాగా భారత్‌లో ఇన్స్టాగ్రామ్ ఖాతాలు బ్లాకైన పాకిస్థాన్ క్రికెటర్లలో బాబర్ ఆజమ్, షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ ఉన్నారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఇన్‌స్టా ఖాతాను కూడా గురువారం ఉదయం భారత్ బ్లాక్ చేసింది. కాగా గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ ఉన్నారు.