Olly Stone | లండన్ : భారత్‌తో కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా యువ పేసర్ ఒలీ స్టోన్.. టీమ్ఇండియాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అబుదాబిలో జరిగిన కౌంటీ ప్రి సీజన్ కోసం సిద్ధమవుతున్న స్టోన్ గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చిందని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
గాయం తీవ్రత తెలియాల్సి ఉందని, స్కానింగ్ పరీక్షల తర్వాత ఒక అంచనాకు వస్తామని ఈసీబీ తెలిపింది. పూర్తిగా కోలుకునేందుకు దాదాపు 14 వారాల సమయం పట్టే అవకాశమున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ వర్గాలు స్పష్టం చేశాయి. జూన్ 20 నుంచి హెడింగ్లే వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మొదలుకానుంది.