England XI : లీడ్స్‌లో విజయంతో జోరు మీదున్న ఇంగ్లండ్ (England) రెండో టెస్టులోనూ చెలరేగాలనే కసితో ఉంది. ఎడ్జ్‌బాస్టన్‌లోనూ భారత జట్టుకు షాకిచ్చి సిరీస్‌లో ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలనుకుంటోంది. రెండో టెస్టుకు రెండు రోజులే ఉండడంతో ఈ దేశబోర్డు సోమవారం తుది జట్టును ప్రకటించింది. అయితే.. నాలుగేళ్ల తర్వాత పునరాగమనం చేయాలనుకున్న పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు మాత్రం చోటు దక్కలేదు. ఈమధ్యే దేశవాళీలో నిప్పులు చెరిగిన ఈ స్పీడ్‌స్టర్‌ను పక్కన పెట్టేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జట్టు కూర్పు బాగుందని.. మార్పులతో ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో మార్పులకు ఈసీబీ నో చెప్పిందని సమాచారం.
లీడ్స్‌లో రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో సూపర్ బోణీ కొట్టింది. 5 వికెట్ల తేడాతో శుభ్‌మన్ గిల్ సేనకు షాకిచ్చిన స్టోక్స్ బృందం అదే ఫలితాన్ని ఎడ్జ్‌బాస్టన్‌లోనూ రిపీట్ చేయాలనుకుంటోంది. అందుకే.. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను మరో మ్యాచ్‌కు కొనసాగించింది. దాంతో, కమ్ బ్యాక్ టెస్టు కోసం ఆర్చర్ నిరీక్షించక తప్పని పరిస్థితి ఎదురైంది. జూన్ 2న బుధవారం జరుగుబోయే రెండో టెస్టులో టీమిండియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య మరోసారి తగ్గపోరు ఖాయమంటున్నారు విశ్లేషకులు.
Look who is back 🤩🤩#ENGvIND #JofraArcher pic.twitter.com/8RJUEqxec6
— Cricbuzz (@cricbuzz) June 26, 2025
ఇంగ్లండ్ తుది జట్టు : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జేమీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రౌడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సీజన్లో బోణీ కొట్టిన ఇంగండ్.. అదే ఉత్సాహంతో ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు సన్నద్ధమవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్(147), రిషభ్ పంత్(134), యశస్వీ జైస్వాల్(101)ల శతకమోతతో భారీ స్కోర్ చేసిన టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ, బుమ్రా మినహా ఇతర బౌలర్ల వైఫల్యం, టీమిండియా చెత్త ఫీల్డింగ్‌ను సొమ్ము చేసుకున్న ఓలీ పోప్(106) సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు.
టాపార్డర్ విఫలమైనా హ్యారీ బ్రూక్(99) విలువైన ఇన్నిగ్స్తో ఆతిథ్య జట్టు 465 పరుగులకే ఆలౌటయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ కేఎల్ రాహుల్(137), రిషభ్ పంత్(118)ల విధ్వంసక సెంచరీలతో మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరింది. కానీ, జోష్ టంగ్(3-72) ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అనంతరం 371 పరుగుల రికార్డు ఛేదనలో ఓపెనర్ బెన్ డకెట్(149) బజ్ బాల్ ఆటతో చెలరేగిపోగా.. జో రూట్(53 నాటౌట్), జేమీ స్మిత్(44 నాటౌట్)లు తమస్టయిల్లో విజృంభించి మ్యాచ్‌ను ముగించారు. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్ సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.