IND A vs England Lions : రెండో అనధికారిక టెస్టులో కేఎల్ రాహుల్(116) సూపర్ సెంచరీని భారత ఏ జట్టు సొమ్ము చేసుకోలేకపోయింది. గత మ్యాచ్‌లో చెలరేగి ఆడిన మిడిలార్డర్ వైఫల్యంతో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ అవకాశాన్ని చేజార్చుకుంది. ధ్రువ్ జురెల్(52), కరుణ్ నాయర్(40) పర్వాలేదనిపించగా అభిమన్యు ఈశ్వరన్ బృందం 348 పరుగులకే ఆలౌటయ్యింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు అదిలోనే యువ పేసర్ అన్షుల్ కంబోజ్ షాకిచ్చాడు. దాంతో, రన్స్‌కే ఆతిథ్య జట్టు 29కే తొలి వికెట్ కోల్పోయింది. లంచ్ సమయానికి ఇంగ్లండ్ లయన్స్ వికెట్ నష్టానికి 58 రన్స్ చేసింది.
వర్షం అంతరాయం కలిగించిన పోరులో భారత జట్టు ట్రిపుల్ సెంచరీ కొట్టింది. కేఎల్ రాహుల్(116) శతకానికి జురెల్ (52), కరుణ్ నాయర్(40)ల విలువైన ఇన్నింగ్స్ తోడవ్వడంతో భారీ స్కోర్ కొట్టేలా కనిపించింది. అయితే.. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్(3-60), జార్జ్ హిల్(2-56)లు మిడిలార్డర్‌ను త్వరగా ఔట్ చేసి టీమిండియాను దెబ్బకొట్టారు. గత మ్యాచ్‌లో ద్విశతకంతో రెచ్చిపోయిన నాయర్‌ను వోక్స్ ఎల్బీగా ఔట్ చేయగా.. జురెల్‌ను జార్జ్ బౌల్డ్ చేశాడు.
After the early departures of Jaiswal and Easwaran, the responsibility quickly piled on Rahul after India A were put in to bat in Northampton https://t.co/nVlUfSV2gP
— ESPNcricinfo (@ESPNcricinfo) June 7, 2025
ఓవైపు వికెట్లు పడుతున్న రాహుల్ సెంచరీతో జట్టును ఆదుకున్న రాహుల్‌ను సైతం జార్జ్ పెవిలియన్ పంపాడు. దాంతో, 285 వద్ద భారత జట్టు ఆరో వికెట్ పడింది. అనంతరం శార్ధూల్ ఠాకూర్(19), తనుష్ కొతియాన్(15)లు కాసేపు పోరాడడంతో స్కోర్ 300 దాటింది. అయితే.. జోష్ టంగ్ బౌలింగ్‌లో కొతియాన్ ఔట్ కావడంతో ఆలౌట్ అంచున నిలిచింది. కాసేపటికే తుషార్ దేశ్‌పాండేను టంగ్ రనౌట్ చేయగా 348 వద్ద భారత ఏ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది.
టీమిండియాను తక్కువకే ఆలౌట్ చేసిన ఇంగ్లండ్ భారీ స్కోర్ చేయాలనే లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించింది. కానీ, అన్షుల్ సూపర్ బౌలింగ్‌తో ఓపెనర్ బెన్ మెకెన్నీ(12)ను వెనక్కి పంపాడు. షాట్ ఆడబోయిన బెన్.. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం గత మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన టామ్ హైన్స్ (28), ఎమిలియో గే(3)లు ఆచితూచి ఆడుతున్నారు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు రన్స్ జోడించడంతో లంచ్ సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. ఇంకా ఆ జట్టు 290 పరుగులు వెనకబడి ఉంది.