హాలియా, జూన్ 07 : అనుముల మండలం పేరూరు గ్రామంలో ఉన్న భువనేశ్వరి సమేత శ్రీ స్వయంభూ సోమేశ్వర స్వామి ఆలయ భూముల కౌలుకు ఈ నెల 16న వేలం పాట నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈఓ వెంకటనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 64 వరకు గల ప్లాట్లకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో వేలం పాట నిర్వహిణ ఉంటుందని వెల్లడించారు. ఆసక్తి గల వారు ప్లాట్‌కు రూ.10 వేల చొప్పున డీడీ చెల్లించి వేలం పాటలో పాల్గొనాల్సిందిగా సూచించారు. వేలం పాటలో పాల్గొనదలచిన వారు గానీ, వారి కుటుంబ సభ్యులు గానీ దేవస్థానానికి ఇప్పటివరకు ఎలాంటి బకాయిలు ఉండరాదన్నారు.