ENG vs BAN | ఛటోగ్రామ్: బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన మూడో వన్డేలో బంగ్లా 50 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. తొలుత షకీబల్‌హసన్ (75), ముష్ఫికర్ రహీమ్ (70), నజ్ముల్ హసన్ (53) అర్ధసెంచరీలతో బంగ్లా 48.5 ఓవర్లలో 246 పరుగులు చేసింది. 17 పరుగులకే ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (11), లిటన్ దాస్(0) వికెట్లను కోల్పోయిన బంగ్లాను నజ్ముల్, ముష్ఫికర్ ఆదుకున్నారు. ఆర్చర్(3/35), రషీద్ (2/21), సామ్ కరాన్ (2/51) రాణించారు.
తర్వాత లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 43.1 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. జేమ్స్ విన్స్(38), ఫిల్ సాల్ట్(35), వోక్స్(34) ఫర్వాలేదనిపించారు. షకీబల్‌హసన్(4/35) నాలుగు వికెట్లతో విజృంభించగా, తైజుల్ (2/52), ఇబాదత్ (2/38) రెండేసి వికెట్లు తీశారు. రషీద్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ దక్కింది.