IND Vs ENG | ఓవల్ : ఇంగ్లండ్-భారత్ మధ్య లీడ్స్ టెస్ట్‌లో ఆతిథ్య జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ స్కోరు 82 వద్ద ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో బెన్ డకెట్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డకెట్ 83 బంతుల్లో ఆరు ఫోర్ల సహాయంతో 54 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం జో రూట్, కెప్టెన్ ఓలీ పోప్ క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు 23 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు రెండు వికెట్లకు 83 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఇంకా 291 పరుగులు చేయాల్సి ఉంది. ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో సిరీస్‌ను సమం చేయాలని భారత జట్టు తహతహలాడుతున్నది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఎదుట 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి రెండ్రోజులు బౌలర్లకు అనుకూలించిన ఓవల్ పిచ్.. మూడోరోజు బ్యాటింగ్‌కు సహకరించడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (118) చేయగా.. ఆకాశ్ దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) రాణించారు.