ENG vs NAM : మాజీ చాంపియన్ ఇంగ్లండ్(England) టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో నమీబియా(Namibia)పై బట్లర్ సేన సూపర్ విక్టరీ కొట్టింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్(DLS) ప్రకారం 41 పరుగులతో ఇంగ్లండ్ గెలుపొందింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన హ్యారీ బ్రూక్(47 నాటౌట్) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో స్కాట్లాండ్ ఓడడంతో ఇంగ్లండ్‌కు సూపర్ 8 బెర్తు దక్కింది.
డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ మెగా టోర్నీని ఓటమితో ఆరంభించింది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమి.. స్కాట్లాండ్తో మ్యాచ్ రద్దు కారణంగా బట్లర్ బ్యాచ్ గ్రూప్ ‘బి’ నుంచి ఎలిమినేట్ అవడం ఖాయం అనిపించింది. అయితే పసికూన ఒమన్(Oman)పై బౌలర్ల విజృంభణతో రికార్డు విజయంతో ఇంగ్లండ్ సూపర్ 8 రేసులోకి వచ్చింది.
ఇక గెలవక తప్పని మ్యాచ్‌లో నమీబియాపై ఇంగ్లండ్ దుమ్మురేపింది. 10 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో చాంపియన్ ఆటతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. హ్యారీ బ్రూక్(41 నాటౌట్), జానీ బెయిర్‌స్టో సుడిగాలిలా చెలరేగారు. దాంతో, ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 122 రన్స్ చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నమీబియా దీటుగా బదులిచ్చింది.
Stylish and classy 🤩
Harry Brook is awarded the @Aramco POTM for his stunning 47* against Namibia 👏#T20WorldCup | #NAMvENG | 📝: https://t.co/QHupV9Efv9 pic.twitter.com/hbfp4kCB5u
— ICC (@ICC) June 15, 2024
ఓపెనర్లు మైఖేల్ వాన్ లింగెన్(33), నికోలాస్ డవిన్(18)లు శుభారంభమివ్వగా.. డేవిడ్ వీస్(27) చితక్కొట్టాడు. కానీ, చివర్లో ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేయడంతో నమీబియా 84 రన్స్ చేసిందంతే. దాంతో, ఇంగ్లండ్ 41 పరుగుల తేడాతో గెలుపొందింది. అయినా స్కాట్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఫలితం తేలితేగానీ సూపర్ 8కు వెళ్తామా? లేదా? అని బట్లర్ సేన కంగారు పడింది. అయితే.. ఆసీస్ జట్టు ఇంగ్లండ్‌కు మేలు చేస్తూ స్కాట్లాండ్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది.
England’s qualification confirms their face-off against an old rival in a classic clash on June 19 in St Lucia 🎉#T20WorldCup
More ⬇https://t.co/JdPmbzdEKU
— ICC (@ICC) June 16, 2024