Josh Buttler : ఇంగ్లండ్ వైట్‌బాల్ కెప్టెన్ బట్లర్(Buttler) తన పేరు మార్చుకున్నాడు. అందరూ తనను తప్పుడు పేరుతో పిలుస్తున్నారని, అందుకనే పేరు మార్చుకున్నానని ఈ డాషింగ్ బ్యాటర్ తెలిపాడు. సోమవారం ఈ చిచ్చరపిడుగు ఓ వీడియో విడుదల చేశాడు. అందులో.. నా అసలు పేరు జోస్ బట్లర్(Jos Buttler).
కానీ, అందరూ నన్ను కొన్ని ఏండ్లుగా జోష్ బట్లర్ అని పిలుస్తున్నారు. మా అమ్మ సైతం అదే పేరుతో పిలిచేది. దాంతో, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో నా పేరును అధికారికంగా జోష్ బట్లర్ (Josh Buttler)గా మార్చుకుంటున్నా అని బట్లర్ తెలిపాడు.
Official statement… pic.twitter.com/r3Kjgdnldu
— England Cricket (@englandcricket) April 1, 2024
ఓపెనర్‌గా విధ్వసంక ఇన్నింగ్స్‌లు ఆడే బట్లర్ ఇంగ్లండ్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. రెండు వరల్డ్ కప్‌లు గెలిచిన ఇంగ్లండ్ జట్టులో అతడు సభ్యుడు. 2022లో బట్లర్ సారథ్యంలోని ఇంగ్లీష్ జట్టు టీ20 వరల్డ్ కప్‌ను ఎగరేసుకుపోయింది.
టీ20 స్పెషలిస్ట్ అయిన బట్లర్.. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 16వ సీజన్ అంతంత మాత్రంగానే ఆడిన అతడు 17వ సీజన్లోనూ నిరాశ పరుస్తున్నాడు. రెండు మ్యాచుల్లో స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. అయినా ఓవర్ యాక్షన్ స్టార్ రియాన్ పరాగ్(Riyan Parag) మెరుపులతో రాజస్థాన్ వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది.