IPL 2024 RR vs MI : ఐపీఎల్ 17వ సీజన్ 14వ మ్యచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తలపడుతున్నాయి. వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచాడు. ఛేజింగ్ చేయాలనే ఆలోచనతో ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
పాండ్యా బృందం ఏ మార్పులు లేకుండా ఆడనుంది. రాజస్థాన్ మాత్రం సందీప్ శర్మ స్థానంలో బర్గర్‌ను తీసుకుంది. ఈ మెగా టోర్నీలో రెండు మ్యాచుల్లో గెలుపొందిన రాజస్థాన్ హ్యాట్రిక్‌పై గురి పెట్టగా.. ఇంతవరకూ బోణీ కొట్టని ముంబై విజయం కోసం శ్రమించనుంది.
ముంబై జట్టు : ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధిర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, జస్ప్రీత్ బుమ్రా, క్వెనా మఫాకా.
రాజస్థాన్ జట్టు : యశస్వీ జైస్వాల్, జోష్ బట్లర్, సంజూ శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హిట్మైర్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, నంద్రే బర్గర్, చాహల్.