ఇంగ్లండ్‌దే రెండో వన్డే
స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా.. వెటరన్ బ్యాటర్ జో రూట్ (133 బంతుల్లో 9 ఫోర్లతో 99 నాటౌట్) అద్భుత పోరాటంతో రెండో వన్డేలో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.
- 4 వికెట్ల తేడాతో ఓడిన భారత్
కార్డిఫ్: స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా.. వెటరన్ బ్యాటర్ జో రూట్ (133 బంతుల్లో 9 ఫోర్లతో 99 నాటౌట్) అద్భుత పోరాటంతో రెండో వన్డేలో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. గురువారం జరిగిన ఈ పోరులో తొలుత భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (71 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66), విరాట్ కోహ్లీ (66 బంతుల్లో 8 ఫోర్లతో 65) అర ్ధశతకాలతో సత్తా చాటారు.
ఇంగ్లిష్ బౌలర్లలో ఆర్చర్ (3/47), అట్కిన్సన్ (3/50) తలో మూడు వికెట్లు తీశారు. అనంతరం ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. బెన్ డకెట్ (0), జాకబ్ బెథెల్ (4)తో పాటు కెప్టెన్ హ్యారీ బ్రూక్ (16) నిరాశపరచడంతో ఆతిథ్య జట్టు ఓ దశలో 53/3తో నిలిచినా.. సామ్ కరన్ (26), బట్లర్ (17), విల్ జాక్స్ (30), అట్కిన్సన్ (23 నాటౌట్)తో కీలక భాగస్వామ్యాలు నిర్మించిన రూట్ జట్టును గెలిపించాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే లార్డ్స్ స్టేడియంలో జరుగుతుంది.
ఆదుకున్న కోహ్లీ, శ్రేయస్
కోహ్లీ, శ్రేయస్ ఆదుకోవడంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగల్గింది. గిల్ (31) వేగంగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. రోహిత్ (26) గత మ్యాచ్ మాదిరిగానే తడబడి మరోసారి నిరాశపరచగా కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ (1) కూడా విఫలమయ్యాడు. ఈ క్రమంలో అయ్యర్‌తో కలిసి విరాట్ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు.
తనదైన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించిన కోహ్లీ.. కరన్ బౌలింగ్‌లో బౌండరీతో తన కెరీర్లో 78వ హాఫ్ సెంచరీని పూర్తిచేశాడు. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే ఆర్చర్ రెండో స్పెల్‌లో అదిల్ రషీద్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. సుందర్ (2) సైతం విఫలమవగా ఆర్చర్ ఒకే ఓవర్లో అక్షర్ (1), దూబే (0)ను ఔట్ చేసి పర్యాటక జట్టును కోలుకోనీయకుండా చేశాడు. చివర్లో బుమ్రా (20 నాటౌట్) కీలక పరుగులు చేసినా.. అట్కిన్సన్ 44వ ఓవర్లో అయ్యర్‌తో పాటు ప్రసిద్ధ్నూ ఔట్ చేసి భారత ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- England
- Ind vs Eng
- India
- Manchester
RELATED ARTICLES
తాజా వార్తలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

