England Vs Australia | చెస్టర్ లీ స్ట్రీట్: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్లో భాగంగా మంగళవారం ముగిసిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 46 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ విధానంలో ఇంగ్లండ్ విజేతగా నిలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది.
అలెక్స్ కేరీ (77), స్టీవ్ స్మిత్ (60) రాణించారు. అనంతరం ఇంగ్లండ్ 37.4 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఇంగ్లండ్ సారథి హ్యారీ బ్రూక్ (110 నాటౌట్), విల్ జాక్స్ (84) అదరగొట్టారు. వర్షం వచ్చే సమయానికి ఇంగ్లండ్ సాధించాల్సిన దానికంటే 46 పరుగులు ఎక్కువగా ఉండటంతో మ్యాచ్ ఆ జట్టు వశమైంది. సిరీస్లో నాలుగో వన్డే ఈనెల 27న లండన్ వేదికగా జరుగనుంది.