ఓల్డ్ ట్రాఫర్డ్: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్లలో ఇరు జట్లు తలా ఒకటి గెలువగా ఆదివారం ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరగాల్సిన మూడో మ్యాచ్ వర్షం కారణంగా రైద్దెంది. దీంతో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య బ్లాక్బస్టర్ పోరును చుద్దామనుకున్న క్రికెట్ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆతిథ్య జట్టుతో ఆస్ట్రేలియా గురువారం నుంచి ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది.