Matthew Matt : సొంతగడ్డపై వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆనందంలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్. పొట్టి ప్రపంచ కప్‌లో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ హెడ్‌కోచ్ మాథ్యూ మ్యాట్(Matthew Matt) తన పదవికి రాజీనామా చేశాడు. టీ20, వన్డే జట్లకు కోచ్‌గా కొనసాగుతున్న మ్యాట్ మంగళవారం పదవి నుంచి వైదొలిగాడు.
దాంతో, ఇంగ్లండ్ క్రికెటో బోర్డు మాజీ కెప్టెన్ మార్కస్ ట్రెస్కోథిక్(Marcus Trescothic)ను తాత్కాలిక కోచ్‌గా నియమించింది. మ్యాట్ తాను కోచ్‌గా తప్పుకుంటున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘ఇంగ్లండ్ పురుషుల జట్టుకు కోచ్‌గా పనిచేసినందుకు చాలా గర్వపడుతున్నా. అది నిజంగా గొప్ప గౌరవం. గత రెండేడ్లుగా విజయవంతం అయ్యేందుకు మేమంతా ఎంతో కష్టపడ్డాం.
ఈ సమయంలో ఇంగ్లండ్ జట్టు ఆటపై చూపించిన నిబద్దత పట్ల, ప్రేమ పట్ల ఎంతో సంతోషంగా, గర్వంగా ఉన్నాను. ఈ కాలంలోనే 2022లో పొట్టి ప్రపంచ కప్ ట్రోఫీ గెలిచాం. ఈ సమయంలో నాకు మద్దతుగా నిలిచిన ఆటగాళ్లకు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులో యాజమన్యానికి కృతజ్ఞతలు చెప్తున్నా. ఎన్నో మధుర జ్ఞాపకాలతో హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలుగుతున్నా’ అని మ్యాట్ అన్నాడు.
Matthew Mott has stepped down as England Men’s white-ball Head Coach.
Assistant Coach Marcus Trescothick has been appointed on an interim basis.
— England Cricket (@englandcricket) July 30, 2024
పొట్టి వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ డిఫెండింగ్ చాంపియన్‌గా అడుగు పెట్టింది. కానీ, స్థాయికి తగ్గట్టు ఆడలేక సూపర్ 8 అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. అయితే.. జోస్ బట్లర్ సేన సంచలన ఆటతో మళ్లీ రేసులోకొచ్చింది. దాంతో, ఇంగ్లండ్ ఫైనల్ చేరడం ఖాయమనుకున్నారంతా. కానీ, బట్లర్ బ్యాచ్‌కు భారత జట్టు చెక్ పెట్టింది.
సెమీఫైనల్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీకితో చెలరేగగా.. స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్ పటేల్‌ల ఇంగ్లండ్ నడ్డి విరిచారు. దాంతో, మాజీ చాంపియన్ అనూహ్యంగా ఇంటి దారి పట్టింది. అప్పటి నుంచి మ్యాట్‌పై వేటు ఖాయమనే వార్తలు వినిపించాయి. అనుకున్నట్టుగానే అతడి పదవి ఊడింది.