ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. భారత సారధి రోహిత్ శర్మ (31) అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఇంగ్లిష్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్ తన తొలి ఓవర్లోనే రోహిత్‌ను పెవిలియన్ చేర్చాడు. గ్లీసన్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదిన రోహిత్.. ఐదో బంతిని కూడా భారీ షాట్‌గా మలిచే ప్రయత్నంలో వికెట్ పారేసుకున్నాడు.
గ్లీసన్ వేసిన షార్ట్ బంతి తన మీదకు వచ్చేయడంతో పుల్ చేసేందుకు ప్రయత్నించిన రోహిత్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ బట్లర్ అందుకోవడంతో భారత జట్టు 49 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్‌గా వచ్చిన రిషభ్ పంత్ కూడా ధాటిగా ఆడుతున్నాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి భారత జట్టు 60/1 స్కోరుతో నిలిచింది.