India A vs England Lions : రెండో అనధికార టెస్టులో భారత ఆటగాళ్లు పరుగుల వరద పారిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదం తొక్కిన కేఎల్ రాహుల్.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో రాణించాడు. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (80) సైతం హాఫ్ సెంచరీ బాదగా భారత ‘ఏ’ జట్టుకు భారీ ఆధిక్యం లభించింది. నాలుగో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ లయన్స్ (England Lions) బౌలర్లను ఉతికేసిన ఈ ఇద్దరూ మంచి పునాది వేయగా నితీశ్ రెడ్డి (42) బ్యాట్ ఝులిపించాడు. అయితే.. మరికాసేపట్లో లంచ్ అనగా శార్దూల్ ఠాకూర్(34)ను జార్జ్ హిల్ బౌల్డ్ చేశాడు. దాంతో, భారత్ జట్టు 7 వికెట్ల నష్టానికి 268 రన్స్ చేసింది. ప్రస్తుతానికి 289 రన్స్ ఆధిక్యంలో ఉంది టీమిండియా.
తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసిన భారత ఏ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో అదరగొడుతోంది. ఖలీల్ అహ్మద్ (4-70) విజృంభణతో ఇంగ్లండ్‌ను 327కే ఆలౌట్ చేసిన టీమిండియా.. అనంతరం దీటుగా ఆడుతోంది. ఓవర్ నైట్ స్కోర్‌తో 75 -1 నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించగా కేఎల్ రాహుల్(51), అభిమన్యు ఈశ్వరన్(80)లు కీలక భాగస్వామ్యం నిర్మించారు. 88 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని ఎడ్డీ జాక్ విడదీశాడు. రాహుల్ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ (15) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరాడు.
India A skipper Abhimanyu Easwaran finds his rhythm! 🇮🇳💪
Two solid fifties in four innings in the ongoing unofficial Test series against England Lions! 🤍🏏#AbhimanyuEaswaran #ENGAvINDA #Sportskeeda pic.twitter.com/7g4yaIQQUX
— Sportskeeda (@Sportskeeda) June 9, 2025
అయినా ఈశ్వరన్ ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా ఆడాడు. ధ్రువ్ జురెల్(28)తో కలిసి స్కోర్‌బోర్డును ఉరికించాడు. సెంచరీ దిశగా వెళ్తున్న అతడిని క్రిస్ వోక్స్ ఔట్ చేసి ఇంగ్లండ్‌కు బ్రేకిచ్చాడు. నితీశ్ రెడ్డి(42), శార్ధూల్ ఠాకూర్(34)లు ప్రత్యర్థి బౌలర్లను విసిగిస్తూ బౌండరీలతో చెలరేగారు. ఇద్దరూ ధనాధన్ ఆడి స్కోర్ బోర్డును 250 దాటించారు. ప్రమాదకరంగా మారిన వీళ్లను జార్జ్ హిల్(3-39) బౌల్డ్ చేయడంతో ఆతిథ్య జట్టు ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. లంచ్ సమయానికి భారత్ 289 పరుగుల ఆధిక్యంలో ఉండగా తనుష్ కొతియాన్ (7) క్రీజులో ఉన్నాడు.