Ph.D. Entrance Test | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ఫ్యాకల్టీలలో పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను అధికారులు సోమవారం విడుదల చేశారు. ఓయూలో కేటగిరి 2 ద్వారా పీహెచ్డీ ప్రవేశాలకు ఏప్రిల్ 25 నుంచి 27 వరకు కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షలను వర్సిటీ నిర్వహించింది. మొత్తం 49 విభాగాల్లో ప్రవేశాలు పొందేందుకు 9,747 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 7,907 మంది పరీక్షలకు హాజరు కాగా, ఉత్తీర్ణత శాతం 62.60గా నమోదయింది.
ఈ సందర్భంగా ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. విభాగాల వారీగా అభ్యర్థుల ర్యాంకు కార్డులను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ఈనెల 23వ తేదీ నుంచి పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.