Team Inida : నిరుడు పేలవ ప్రదర్శనతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC )ఫైనల్ అవకాశాన్ని చేజార్చుకుంది టీమిండియా. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్, ఆపై ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ ఓటమితో టాప్-2లో నిలవలేకపోయింది. ఈసారి కొత్త సైకిల్లో భారత జట్టు ఏ పొరపాటు చేయకూడదు అనుకుంటోంది. అందుకే కోచింగ్ సిబ్బందిని బలోపేతం చేసుకుంది. అంతర్జాతీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన అడ్రియన్ లే రౌక్స్ (Adrian le Roux)ను స్ట్రెంత్, కండిషనింగ్ కోచ్‌గా నియమించింది బీసీసీఐ.
దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్‌ను ‘స్పోర్ట్స్ సైంటిస్ట్’ అని పిలుస్తారు. క్రికెట్ గురించి అణువణువు తెలిసన అతడు ఆటగాళ్ల సామర్ధ్యాన్ని, మానసిక శక్తిని పెంచడంలో దిట్ట. గతంలో(2002 జనవరి నుంచి 2023 మే వరకూ)నూ ఆయన భారత జట్టుకు స్ట్రెంత్, కండిషనింగ్ కోచ్‌గా సేవలందించాడు.
𝗣𝗿𝗲𝗽 𝗕𝗲𝗴𝗶𝗻𝘀 ✅
First sight of #TeamIndia getting into the groove in England 😎#ENGvIND pic.twitter.com/TZdhAil9wV
— BCCI (@BCCI) June 8, 2025
ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఆటగాళ్ల ఫిట్నెస్ను కాపాడని అడ్రియాన్. అందుకే సోహమ్ దేశాయ్ (Soham Desai) స్థానంలో అతడిని ఎంపకి చేసింది బీసీసీఐ. ఇంగ్లండ్ పర్యటనలో 5 టెస్టులు అంటే.. దాదాపు రెండు నెలల సమయం అక్కడే ఉండాలి. సుదీర్ఘ సిరీస్ కావడంతో ఆటగాళ్లు గాయపడే అవకాశాలు ఎక్కువ. పైగా అలసత్వం కూడా దరి చేరే వీలుంది.
కాబట్టి.. భారత క్రికెటర్లు శారీరకంగా ద్రుఢంగా ఉండేలా.. గాయాల బారిన పడకుండా చూసే బాధ్యతను అడ్రియన్‌కు అప్పగించింది బీసీసీఐ. లార్డ్స్‌లో టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న అతడు ఆటగాళ్లకు సూచనలు, సలహాలు ఇస్తూ కనిపించాడు. ఒక్కొక్క ప్లేయర్‌ను జాగ్రత్తగా గమనిస్తూ.. వాళ్ల బలాబలాలు, పొరపాట్లను తెలియజేయడమే అడ్రియాన్ పని. దాంతో.. క్రికెటర్లు తమను తాము మెరుగుపరచుకొని.. మ్యాచ్‌లో రాణించేలా చేస్తాడన్నమాట. 5 టెస్టుల సిరీస్‌లో ఆతిథ్య జట్టుపై పైచేయి సాధించడంలో అతడి సేవలు శుభ్‌మన్ గిల్ సేనకు ఎంతగానో ఉపకరిస్తాయని బోర్డు నమ్ముతోంది.
ఇంగ్లండ్ పర్యటన అంటేనే అభిమానులకు చేదు అనుభవాలే గుర్తుకొస్తాయి. 2007లో రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) సారథ్యంలోనిసిరీస్ గెలుపొందిన భారత జట్టు ఆ తర్వాత ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేదు. పలువురు కెప్టెన్లు ఎంతో శ్రమించినా కూడా ఫలితం మాత్రం మారలేదు. దాంతో, ఈసారి విక్టరీతో చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది. పైగా 2025-27 సైకిల్లో గిల్ సేనకు ఇదే తొలి సిరీస్. సో.. ఆతిథ్య జట్టుకు చెక్ పెట్టేందుకు అస్త్ర శస్త్రాలను సిద్దం చేసుకుంటోంది భారత్.
ట్రోఫీ సంబురంలో ద్రవిడ్ బృందం
జూన్ 20న లీడ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్‌ల మధ్య తొలి మ్యాచ్‌తో సిరీస్ ఆరంభం కానుంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్‌లు లేకుండా టీమిండియా ఆడుతున్న మొట్ట మొదటి సిరీస్ ఇది. దాంతో.. కుర్రాళ్లతో కూడిన జట్టును గిల్ ఎలా నడిపిస్తాడు? అని అందరిలో ఆసక్తి నెలకొంది. అంతేకాదు కోచ్ గౌతం గంభీర్ భవితవ్యం కూడా ఇంగ్లండ్ పర్యటన ఫలితంపై ఆధారపడి ఉందంటున్నారు విశ్లేషకులు.