BCCI : ఐపీఎల్ ముగియడంతో ఇంగ్లండ్ పర్యటన (England Tour)కు వెళ్లిన భారత జట్టు అనంతరం స్వదేశంలో వన్డే సిరీస్ ఆడనుంది. మహిళల జట్టు సైతం సొంతగడ్డపై ఆస్ట్రేలియా (Australia)తో తలపడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సోమవారం మ్యాచ్ వేదికలను ఖరారు చేసింది. అయితే.. షెడ్యూల్ ప్రకారం ముందస్తుగా కేటాయించిన మైదానాల్లో స్వల్ప మార్పులు చేసింది బీసీసీఐ.
వెస్టిండీస్ పురుషుల జట్టు అక్టోబర్‌లో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత పర్యటనకు రానుంది. ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లో జరుగనుంది. అనంతరం 10వ తేదీన రెండో టెస్టు కోల్‌కతాలో జరగాల్సింది. కానీ, ఈ మ్యాచ్‌ను వేదికను ఢిల్లీకి తరలించింది బీసీసీఐ. నవంబర్ 14న భారత్, దక్షిణాఫ్రికాలు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో తొలి టెస్టు ఆడాల్సింది. కానీ, ఇప్పుడు ఆ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది.
🚨 NEWS 🚨
BCCI announces updated venues for Team India (International home season) & South Africa A Tour of India.
Details 🔽 #TeamIndia | @IDFCFIRSTBank https://t.co/vaXuFZQDRA
— BCCI (@BCCI) June 9, 2025
హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఇంతకుముందు ఈ మూడు వన్డేల సిరీస్‌ను చెన్నైలోని చిదంబరం స్టేడియంలో నిర్వహించాలనుకున్నారు. కానీ, కానీ, అక్కడ పిచ్, ఔట్‌ఫీల్డ్ (Outfield) మరమ్మతు పనులు జరుగుతున్నందున వేదికను మార్చాలని బీసీసీఐ భావించింది. అందుకే వీటిలో తొలి రెండు మ్యాచ్‌లను ఛండీగఢ్‌లో, చివరి వన్డేను ఢిల్లీలో జరపాలని బీసీసీఐ నిర్ణయించింది.
అలానే భారత ‘ఏ’ జట్టుతో దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టు మ్యాచ్‌ల వేదిక కూడా మారింది. నవంబర్ 13 నుంచి మూడు వన్డే మ్యాచులకు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వాల్సింది. అయితే.. ఈ మైదానం బదులు రాజ్‌కోట్‌లో సఫారీ ఏ జట్టుతో భారత కుర్రజట్టు తలపడనుంది.