Huzurabad | హుజురాబాద్ టౌన్, జూన్ 09: తెలంగాణ బీసీ సిటిజన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ నల్ల నారాయణరెడ్డిని పట్టణం లోని మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ కెంసారపు సమ్మయ్య, బీసీ సిటిజన్ ఫోరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చందుపట్ల జనార్ధన్, సందేల వెంకన్న మాట్లాడుతూ.. వైద్యో నారాయణ అనే విధంగా పనిచేస్తూ హాస్పిటల్ కు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో వైద్యులది ప్రధాన పాత్ర అని గుర్తిస్తూ వైద్యులందరూ సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ, సరైన విధంగా తమ బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ఆలేటి రవీందర్, కోశాధికారి ఆకుల సదానందం, కార్యదర్శి ఉప్పు శ్రీనివాస్, నాయకులు ఇప్పకాయల సాగర్, రాఘవుల శ్రీనివాస్, ముషం రమేష్, పల్లె సతీష్, బీసీ నాయకులు సందుపట్ల సదానందం, శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.